»   »  మహేష్ ని చూసి సిగ్గుపడేవాణ్ణి: కొరటాల శివ (ఇంటర్వూ)

మహేష్ ని చూసి సిగ్గుపడేవాణ్ణి: కొరటాల శివ (ఇంటర్వూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'షాట్‌ చేసేప్పుడు మానిటర్‌లో చూస్తూ నేను ‘ఒకే.. సూపర్‌గా ఉంది' అన్న తర్వాత కూడా ఇంకో టేక్‌ చేసి చూస్తానని, మహేష్ చేస్తారు. ప్రొఫెషనలిజమ్‌లో అంతటి పీక్‌లో ఉం టారు. డైరెక్టర్‌కు కూడా తెలీని డీటెయిలింగ్‌ ఆయనలో ఉంది. ఆయనలోని ఆ గుణాన్ని చూసి నేను సిగ్గుపడ్డ సందర్భాలున్నాయి అంటున్నారు' కొరటాల శివ.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ప్రభాస్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘మిర్చి'తో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ రెండో సినిమా ‘శ్రీమంతుడు'. మహేశ్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఆయనతో పాటు మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ నిర్మించారు. ఆగస్ట్‌ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతున్న సందర్బంగా మీడియాతో కొరటాల శివ మాట్లాడారు.


మహేష్ గురించి ఆయన చెప్తూ... 'భారతదేశంలోని అత్యుత్తమ నటుల్లో మహేష్‌ ఒకరు. పాత్రని దాటి ఆయనేదీ చేయరు. 'ఇక్కడ ఈ డైలాగ్‌ని మరోలా చెబుదాం. విజిల్స్‌ ఎక్కువ పడతాయ్‌' అన్నా ఆయన చేయరు. కథని, పాత్రని దాటి ఒక్క ఇంచి కూడా ముందుకు వేయరు'' అన్నారు కొరటాల శివ. ఆయన నమ్మి చేసిన ఈ చిత్రం మహేష్ సైతం బాగా నమ్మకంగా ఉన్నారు.


మహేష్ కెరీర్ లో ఫ్లాఫ్ లుగా నిలిచిన 1 నేనొక్కడినే, ఆగడు తర్వాత వస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా అబిమానులను అలరిస్తుందని భావిస్తున్నారు. సినిమా ట్రైలర్స్ , మేకింగ్ వీడియోలు ఇప్పటికే విడుదలై సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.


కొరటాల శివ ఇంటర్వూ...స్లైడ్ షోలో...


'శ్రీమంతుడు' ఎలా ఉంటాడు?

'శ్రీమంతుడు' ఎలా ఉంటాడు?


నా 'శ్రీమంతుడు' చాలా సింపుల్‌ వ్యక్తి. వేల కోట్ల అధిపతి అయినా, మనలా మాములు మనిషిలానే ఉంటాడు. విమానాల్లో తిరగ్గలడు, అవసరమైతే కాకా హోటల్‌లో టీ తాగేంత సాధారణ జీవితమూ గడపగలడు. అలాంటి ఓ వ్యక్తి ప్రయాణం నా సినిమా. అతనికి సైకిల్‌ అంటే ఇష్టం. సైకిల్‌ తొక్కుకుంటూ ఎక్కడికైనా వెళ్లిపోతుంటాడు.కథకు ప్రేరణ ఇదే...

కథకు ప్రేరణ ఇదే...


వారెన్‌ బఫెట్‌ తన సంపాదనలో ముప్పావు భాగం తిరిగి సమాజానికే ఇచ్చేశాడు. అలాగే బిల్‌ గేట్స్‌ సగం సంపాదనను ఫౌండేషన్‌కు ఇచ్చేశాడు. విప్రో ప్రేమ్‌జీగారూ అంతే. వాళ్లలో నేను హీరోయిజం చూశాను. ఈ విషయాన్నే మృదువుగా కాకుండా కమర్షియల్‌ పంథాలో ఎమోషనల్‌గా, హార్డ్‌ హిట్టింగ్‌గా చెప్పా. ఉన్నదాన్ని పంచిపెట్టడాన్ని మించిన హీరోయిజం ఎక్కడుంది? అందుకే ఈ అంశం నన్ను బాగా ప్రేరేపించింది.అదే ప్రధానాంశం...

అదే ప్రధానాంశం...


ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న హీరో దాని కోసం ఏం చేశాడు, ఆ క్రమంలో ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించాడనేది ప్రధానాంశం.అందుకే 'శ్రీమంతుడు' రాసా

అందుకే 'శ్రీమంతుడు' రాసా


మహేష్‌బాబు లాంటి హీరో దొరికితే మామూలు కమర్షియల్‌ కథ చెప్పకూడదు. ఇంకా ఏదో కావాలి అనిపించింది. అందుకే 'శ్రీమంతుడు' లాంటి కథ రాసుకొన్నా.ఎగ్జైట్ అయ్యి..మార్చవద్దన్నారు.

ఎగ్జైట్ అయ్యి..మార్చవద్దన్నారు.


‘కమర్షియల్‌ సినిమాలో ఇంత కొత్త డైమన్షన్‌ చెప్పొచ్చా, ఇలాంటి ఎమోషన్స్‌ చెప్పొచ్చా' అని ఆయన ఎగ్జయిట్‌ అయ్యారు. ఇంకేం మార్చకుండా తనకు చెప్పింది చెప్పినట్లు తియ్యమనీ, సూపర్‌హిట్టవుతుందనీ చెప్పారు. మహేశ్‌తో ఇంట్రడక్షన్‌ ఫైట్‌, పాటలు, నాలుగు పంచ్‌ డైలాగులతో సినిమా పూర్తి చెయ్యడం ఇష్టం లేదు.కథ విన్న మహేష్‌ స్పందనేంటి?

కథ విన్న మహేష్‌ స్పందనేంటి?


కథ చాలా బాగుంది. మీరు నాకేం చెప్పారో, చెప్పింది చెప్పినట్టు తీసేయండి.. ఒక్కసీన్‌ కూడా మార్చొద్దు అన్నారు. మేం కూడా అలానే తీశాం.డైలాగ్స్ మీదే..

డైలాగ్స్ మీదే..


మహేశ్‌తో ఇంట్రడక్షన్‌ ఫైట్‌, పాటలు, నాలుగు పంచ్‌ డైలాగులతో సినిమా పూర్తి చెయ్యడం ఇష్టం లేదు. ఇలాంటి హీరో దొరికినప్పుడు బలమైన మాటలు చెప్పాలి. కానీ అవి కథలోంచి రావాలి. డైలాగ్స్‌ని ఆయన అసాధారణంగా చెబుతారు. అందుకని డైలాగ్స్‌ మీద ఎక్కువ వర్క్‌ చేశాను.ఎంజాయ్ చేసా

ఎంజాయ్ చేసా


ఈ సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్స్‌ని ఓ ప్రేక్షకుడిగా ఎంత ఎంజాయ్‌ చేశానో చెప్పలేను. ఈ సినిమాకు మొదటి ప్రేక్షకుణ్ణి నేనే. నేను రాసుకున్న మాటలు ఆయన నోటినుంచి వస్తుంటే మానిటర్‌ ముందు ఓ డైరెక్టర్‌గా కంటే ఓ ప్రేక్షకుడిగానే ఎక్కువ ఎంజాయ్‌ చేశాను.మహేష్‌ చాలా స్త్టెలిష్‌ కనిపిస్తున్నారు..

మహేష్‌ చాలా స్త్టెలిష్‌ కనిపిస్తున్నారు..


స్వతహాగా ఆయన అందగాడు. టీషర్ట్‌ వేసినా ఆయన స్త్టెల్‌గానే కనిపిస్తారు. సినిమాని స్త్టెలిష్‌గా తీయాలి, పాత్రలు స్త్టెలిష్‌గా ఉండాలనుకోవడం తప్పులేదు. కానీ.. ఏదీ కథకు అతీతంగా వెళ్లకూడదు. దర్శకుడు తీసే ప్రతి కథకూ ఓ స్టైల్‌ ఉంటుంది, ఉండాలని నమ్మే వ్యక్తిని నేను.కథకు అనుగుణంగానే..

కథకు అనుగుణంగానే..


ఈ సినిమాలో మేం ఏం చేసినా, తెరపై మీరేది చూసినా కథకు అనుగుణంగానే సాగుతుంది. శ్రుతి హాసన్‌, జగపతిబాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్‌ ఇలా ప్రతి పాత్రలోనూ నటీనటులు కాకుండా కేవలం ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది.మహేష్ డీవియేట్ అవ్వరు..

మహేష్ డీవియేట్ అవ్వరు..


రచయిత ఊహ ఎప్పుడూ అందంగా ఉంటుంది. అది తెరమీద 50 శాతం మేర బాగా వచ్చినా చాలనుకుంటాం. కానీ మహేశ్‌ దాంతో తృప్తిచెందరు. కేరక్టర్‌ను పట్టించుకున్న రోజు నుంచీ డబ్బింగ్‌ చెప్పేదాకా దానిలోనే ఉంటారాయన. దాని నుంచి డీవియేట్‌ అవ్వరు. మహేష్‌ గురించి ఒక్కమాటలో ..?

మహేష్‌ గురించి ఒక్కమాటలో ..?


‘నేను పరిశీలించినంత వరకు మహేశ్‌ మన కాలపు ఉత్తమ నటుల్లో ఒకరు. ఆయన పర్ఫెక్షనిస్ట్‌. అమీర్‌ఖాన్‌ కంటే బెటర్‌ పర్ఫెక్షనిస్టుని ఆయనలో చూశాను అన్నారు.పెద్ద హీరోలకే కథలు రాసుకొంటారా?

పెద్ద హీరోలకే కథలు రాసుకొంటారా?


అదేం లేదు. కొత్తవాళ్లతోనూ సినిమాలు తీయాలని ఉంది. 'సీతాకోకచిలుక'లా.. ఓ విభిన్నమైన కథ దొరికితే తప్పకుండా కొత్తవాళ్లతోనే చేస్తా. చిన్న కథైనా, స్టార్‌ సినిమా అయినా చెప్పాలనుకొన్న విషయాన్ని బలంగా, బల్లగుద్దినట్టు చెబుతా. అది మాత్రం వదలను.నవ్వుతూనే ఉంటారు

నవ్వుతూనే ఉంటారు


మంచి ఎండాకాలంలో ఈ సినిమా షూటింగ్‌ చేశాం. అలాంటి వేడి వాతావరణాన్ని తన జోకులతో లైవ్‌లీగా ఆయన మార్చేసేవాళ్లు. నవ్వులేకపోతే ఆయన బతకలేరు. తను నవ్వుతుంటారు, అందర్నీ నవ్విస్తుంటారు. మహేశ్‌ బెస్ట్‌ యాక్టర్‌ అనేది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని పక్కనపెడితే అంతకంటే ఎక్కువ హ్యూమర్‌ను ఇప్పటివరకూ ఎవరిలోనూ నేను చూడలేదు. సెట్స్‌పై ఉదయం నుంచి సాయంత్రం వరకూ షాట్‌ టైమ్‌లో తప్ప మిగతా టైమ్‌లో జోకులు పడిపోవాల్సిందే.సూపర్ స్టార్ కనపడడు...

సూపర్ స్టార్ కనపడడు...


ఒక సారి సెట్‌కొచ్చి, కేరవాన్‌ నుంచి దిగితే, ఆయనలో సూపర్‌స్టార్‌ మనకు కనిపించడు. ఎలాంటి హడావుడీ లేకుండా కామ్‌గా వచ్చి కూర్చుంటారు. ఎలాంటి ఆర్భాటాలూ, హంగులూ ప్రదర్శించరు.ద్వితీయ విఘ్నం సెంటిమెంట్‌ గురించి?

ద్వితీయ విఘ్నం సెంటిమెంట్‌ గురించి?


అలాంటి సెంటిమెంట్లు నాకేమీలేవు. మంచి కథ రాశానా, లేదా..? అనేదే ఆలోచిస్తా. కథలో దమ్ముంటే కచ్చితంగా మంచి సినిమానే తీస్తామన్న నమ్మకం నాది. కథ రాసేసి, బౌండ్‌ స్క్రిప్టు చేతిలో పెట్టుకొంటే సినిమా పూర్తయిపోయినట్టే లెక్క.ఎవరూ టచ్ చేయలేదు

ఎవరూ టచ్ చేయలేదు


‘శ్రీమంతుడు'లో లార్జన్‌ దేన్‌ లైఫ్‌ కొత్త ఎమోషన్‌తో పాటు నెవర్‌ బిఫోర్‌ ఫ్యామిలీ ఎమోషన్‌ ఉంది. అసలు ఈ ఏంగిల్‌లో ఫ్యామిలీ ఎమోషన్‌ను ఎవరూ టచ్ చేసి ఉండరు. అలాంటి కొత్త ఫ్యామిలీ డ్రామా ఇది. ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్‌ రావడం కష్టం. ‘శ్రీమంతుడు' కేరక్టర్‌ని బట్టి అది వచ్చింది. ఎక్కడా ఓవర్‌ కాని, ఎక్కడా మెలో అవని డ్రామా.తదుపరి సినిమా ఎవరితో, ఎప్పుడు?

తదుపరి సినిమా ఎవరితో, ఎప్పుడు?


ఇంకా ఏం అనుకోలేదు. 'శ్రీమంతుడు' స్పందన చూసి తదుపరి ఎలాంటి కథ చెప్పాలనేది ఆలోచిస్తా.


అంచనాలు తెలుసు..

అంచనాలు తెలుసు..


మొదటి సినిమా ‘మిర్చి' పెద్ద హిట్టు కాబట్టి రెండో సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయని తెలుసు. పైగా చేసింది మహేశ్‌తో. అందుకే ఒకటికి పదిసార్లు ఆలోచించి స్ర్కిప్ట్‌ రాశాను. పదిమందితో షేర్‌ చేసుకున్నాను. సెట్స్‌మీదకు వెళ్లాక ఎలాంటి ఒత్తిడీ లేకుండా చేసుకుపోయాను.ఈ చిత్రంలో...

ఈ చిత్రంలో...


మహేశ్ ఏడు రకాల డిఫరెంట్ లుక్స్‌తో అలరించబోతున్నాడట. ఇప్పటికే విడుదలైన కొన్ని లుక్స్‌లో మహేశ్ కాలేజీ స్టూడెంట్‌లా క్లాస్‌గా కనిపిస్తే... ఓ సాంగ్‌లో మాస్ ‌లుక్‌లో కనిపించాడు. మహేశ్ అటు మాస్ ప్రేక్షకులతో పాటు ఇటు క్లాస్ ఆడియెన్స్ కూడా మెప్పించనున్నాడని తెలుస్తోంది.English summary
Mahesh Babu starer Srimanthudu set to release on August 7th.. Koratala Shiva Is the director of the film. Devi Sri Prasad is the music director. Shruti Hasan is the female lead. Mythri Movie makers are the producers.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu