»   » శ్రీమంతుడు: ఓపెనింగ్ డే టార్గెట్ ఎన్నికోట్లు?

శ్రీమంతుడు: ఓపెనింగ్ డే టార్గెట్ ఎన్నికోట్లు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు' సినిమా రేపు(ఆగస్టు 7)న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రికార్డు స్థాయిలో అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది. ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు వసూలు చేస్తుందనే విషయంలో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఇప్పటికే మొదలైన అడ్వాన్స్ బుకింగ్, ఆన్ లైన్ బుకింగ్, థియేటర్ల సంఖ్యను బట్టి తెలుగు రాష్టాల్లో ఈ చిత్రం ఓపెనింగ్ డే రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ రూ. 12 కోట్ల నుండి 14 కోట్లకు తగ్గకుండా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల తర్వాత అత్యధిక వసూలయ్యే ఓవర్సీస్ మార్కెట్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోలతో కలిపి అత్యధికంగా 160 స్క్రీన్లలో విడుదలవుతోంది. ప్రీమియర్ షో ద్వారా దాదాపు 1 మిలియన్ డాలర్లు వసూలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.


Srimanthudu openings target

తెలుగుతో పాటు తమిళంలో ‘సెల్వందన్' పేరుతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం.


ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
As per the early predictions, Srimanthudu is poised to collect anywhere close to 12-14 crores in the Telugu states on its opening day alone. In the US, the film is releasing in more than 160 screens and including premiers, a $1million debut seems to a possibility.
Please Wait while comments are loading...