»   » మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సిల్వర్ జూబ్లీ

మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సిల్వర్ జూబ్లీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన హోల్‌సమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'శ్రీమంతుడు'. ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలవడమే కాకుండా 100 కోట్ల షేర్‌ సాధించి సూపర్‌స్టార్‌ మహేష్‌ చిత్రాల్లో రికార్డ్‌ సృష్టించింది. 15 సెంటర్స్‌లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపటి(28 జనవరి)తో సిల్వర్‌ జూబ్లీ పూర్తి చేసుకోబోతోంది. ఎమ్మిగనూరు - లక్ష్మణ్‌ థియేటర్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు పూర్తి చేసుకోబోతోంది.

srimanthudu

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు, మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) మాట్లాడుతూ - ''మా బేనర్‌లో నిర్మించిన 'శ్రీమంతుడు' చిత్రం రేపటికి 175 రోజులు పూర్తి చేసుకోబోతోంది. మా మొదటి ప్రయత్నంగా నిర్మించిన ఈ చిత్రం ఇంత భారీ విజయాన్ని సాధించడం ఎంతో ఆనందంగా వుంది. డైరెక్టర్‌ కొరటాల శివ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా రూపొందించి మా బేనర్‌కు ఘనవిజయాన్ని చేకూర్చారు. మా తొలిసినిమాని సూపర్‌స్టార్‌ మహేష్‌తో నిర్మించడం, అది సిల్వర్‌ జూబ్లీ చిత్రం కావడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రానికి 6 'ఐఫా' అవార్డులు రావడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

'శ్రీమంతుడు' చిత్రానికి అవార్డుల పంట
సూపర్‌స్టార్‌ మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన 'శ్రీమంతుడు' చిత్రం 6 'ఐఫా' అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటుడుగా సూపర్‌స్టార్‌ మహేష్‌, ఉత్తమనటిగా శృతిహాసన్‌, ఉత్తమ సహాయనటుడిగా జగపతిబాబు, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్‌, ఉత్తమ గేయరచయితగా రామజోగయ్యశాస్త్రి(రామ.. రామ), ఉత్తమ నేపథ్యగాయకుడిగా సాగర్‌(జతకలిసే..) 'ఐఫా' అవార్డులు అందుకున్నారు.

English summary
Tollywood super star Mahesh Babu's super hit film Srimanthudu Silver Jubilee completed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu