»   » ‘బాహుబలి’తో వద్దనే, మహేష్ ‘శ్రీమంతుడు’వాయిదా!

‘బాహుబలి’తో వద్దనే, మహేష్ ‘శ్రీమంతుడు’వాయిదా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ ఫినిషింగ్ దశలో ఉంది. మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. అన్ని పూర్తి చేసి జులై 17న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం జులైలో విడుదల కావడం లేదని, ఆగస్టులో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అఫీసియల్ ప్రకటన మాత్రం వెలువడలేదు. జులై 10న ‘బాహుబలి' సినిమా ఉండటంతో ఆ సినిమాతో పోటీ పడటం ఇష్టం లేకనే ‘శ్రీమంతుడు' చిత్రాన్ని ఆగస్టుకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.


మైత్రీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న 'శ్రీమంతుడు' చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు... దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.


Srimantudu to be postponed ?

ఇక ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని, టీజర్ ని ఇప్పటికే విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో సైకిల్‌పై స్త్టెలిష్‌గా కనిపిస్తున్న మహేష్‌ లుక్‌ కి మంచి స్పందన వచ్చింది. ఆడియో ని ఈ నెల 27న హైదరాబాద్ లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


మహేష్ బాబు సరసన శృతి హాసన్‌ హీరోయిన్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' పోస్టర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్‌బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు.

English summary
Mahesh Babu film Srimantudu was supposed to hit the screens this July 17th, but according to the latest reports, looks like the film’s release has been pushed ahead to August. However, there is no official confirmation about this from the production house.
Please Wait while comments are loading...