»   » శ్రీనివాస రెడ్డి బూతు పద ప్రయోగం, ఎంజాయ్ చేసిన త్రివిక్రమ్, స్టేజీపైనే ఇవన్నీ..

శ్రీనివాస రెడ్డి బూతు పద ప్రయోగం, ఎంజాయ్ చేసిన త్రివిక్రమ్, స్టేజీపైనే ఇవన్నీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ లో ఓ చిత్రమైన సంప్రదాయం ఉంది. సినిమా బాగున్నా,బాగోపోయినా. వెబ్ సైట్ రివ్యూలలో బాగుందని రాస్తే వాటిని ..ఫలానా సైట్ మా సినిమాకు ఇంత రేటింగ్ ఇచ్చింది..అంత రేటింగ్ ఇచ్చింది అని దాన్ని హైలెట్ చేస్తూ ..ప్రచారం చేసుకోవటానికి వాడుకుంటూంటారు. అదే సినిమాలో ఫలానా నెగిటివ్ పాయింట్ ఉంది అని రివ్యూలలో ఎత్తి చూపారా..వారికి కోపం నషాలానికి వచ్చేస్తుంది.

నిర్మాత,దర్శకుడు కు కోపం రావటమే కాదు... ఈ మధ్యన కమిడయన్స్ కు కూడా కాలిపోతోంది. దాంతో తాము ఏం స్టేజిపై మీడియా ఎదురుగా ఏం మాట్లాడుతున్నామో అని కూడా చూసుకోకుండా బూతులు మాట్లాడటం జరుగుతోంది. తాజాగా ..త్రివిక్రమ్ , నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ..అ..ఆ సినిమా సక్సెస్ మీట్ లో కమిడయన్ శ్రీనివాస రెడ్డి కూడా బూతు ప్రయోగం చేస్తూ వెబ్ మీడియాపై విరుచుకుపడ్డాడు.

అయితే ఇక్కడ చిత్రం ఏమిటంటే ఎంతో సంస్కారం ఉన్నారు, గొప్ప వ్యక్తి అని చెప్పుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ బూతు పదాన్ని జోక్ లా ఎంజాయ్ చేయటం. అంటే ఆయన సపోర్ట్ తోటే ధైర్యంగా శ్రీనివాస రెడ్డి రెచ్చిపోయాడన్నమాట.

 Srinivas Reddy comments on Web media @ AAa successmeet

అవునూ త్రివిక్రమ్ కు ఎందుకు కోపం వచ్చిదయ్యా అంటే....అ..ఆ చిత్రం ఆయన గత చిత్రాలులుగా అద్బుతమని పొగడకుండా కాస్త సెకండాఫ్ లో డల్ అయ్యిందని, త్రివిక్రమ్ జోక్స్ పేలలేదని రాసారు. అంతేనా మీనా చిత్రం అనఫీషియల్ రీమేక్ అనే నిజం చెప్పేసారు. ఇవిన్ని చూసిన త్రివిక్రముడు ... శ్రీనివాస రెడ్డి కు రెచ్చిపో అని అభయమిచ్చినట్లున్నాడు..

అంతే ఇదిగో..మీ బాల్స్ మీరు పిసుక్కోండి అనే అర్దం వచ్చేలా..ఆయన అనేసాడు. దాన్ని త్రివిక్రమ్ ఎంతగా ఎంజాయ్ చేసాడో ..మీరు ఈ క్రింద వీడియోలో చూడవచ్చు.


ఈ సినిమాలో సమంత..స్ట్రెస్ తగ్గటానికి బాల్ పిసుకుతూంటుంది. వీళ్లూ (వెబ్ రివ్యూ రైటర్లు) స్ట్రెస్ తగ్గటానికి బాల్ పిసుక్కుంటే సరి. అలాంటి బాలే అక్కర్లేదు. ఏ బాలైనా పిసుక్కోవచ్చు.

త్రివిక్రమ్ మాట్లాడుతూ..''సన్నాఫ్‌ సత్యమూర్తి' తరవాత ఎవరితో సినిమా చేయాలి అనే సందిగ్ధంలో ఉన్నాను. అదే విషయం ఓసారి పవన్‌ కల్యాణ్‌గారితో మాట్లాడుతున్నప్పుడు 'ఇంతకు ముందు నితిన్‌తో ఓ సినిమా చేస్తానన్నారు కదా, తనతో సినిమా చేయడం ధర్మం' అన్నారు. అందుకే నితిన్‌తో ఈ సినిమా పట్టాలెక్కించా'' అన్నారు త్రివిక్రమ్‌.

త్రివిక్రమ్‌ కంటిన్యూ చేస్తూ.. ''నాకిష్టమైన రచయిత్రి యద్ధనపూడి సులోచనారాణి మూలకథ అందించిన చిత్రమిది. అయితే టైటిల్‌ కార్డ్స్‌లో ఆమె పేరు సాంకేతిక కారణం వల్ల వేయలేకపోయాం. ఆ తరవాత ఆ పేరు జోడించాం. ఇక్కడితో ఈ 'అఆ' కథకు సంబంధించిన వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందని భావిస్తున్నా అన్నారు.


ఇక 'సన్నాఫ్‌ సత్యమూర్తి' సమయంలో 'మీరు మెదడుతో ఆలోచిస్తారు. హృదయంతో పనిచేయరా?' అని అడిగారు సమంత. ఆ మాట నన్ను ముందుకు నడిపించిందనుకొంటున్నా. అడిగినన్ని కాల్షీట్లు ఇచ్చి, ఈ సినిమాకి ఆమె ఎంతగానో సహాయపడ్డారు. నితిన్‌ కూడా అంతే. అందుకే ఇది ఇద్దరు హీరోల సినిమా అనొచ్చు'' అన్నారు.

నితిన్ మాట్లాడుతూ..''ఈ చిత్రం విజయం త్రివిక్రమ్‌గారికే దక్కుతుంది. ఎందుకంటే ఆయన అంతలా కష్టపడ్డారు''అన్నారు నితిన్‌.''కొన్ని చిత్రాలకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ఇంకొన్ని చిత్రాలకు డబ్బులొస్తాయి. 'అఆ'తో రెండూ దక్కాయి''అంది సమంత.


అ..ఆ సినిమాలో సమంత..స్ట్రెస్ తగ్గటానికి బాల్ పిసుకుతూంటుంది. వీళ్లూ (వెబ్ రివ్యూ రైటర్లు) స్ట్రెస్ తగ్గటానికి బాల్ పిసుక్కుంటే సరి. అలాంటి బాలే అక్కర్లేదు. ఏ బాలైనా పిసుక్కోవచ్చు అంటూ కమిడయన్ శ్రీనివాస రెడ్డి చేసిన వల్గర్ కామెంట్ ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. త్రివిక్రమ్ అండతోనే శ్రీనివాసరెడ్డి అలా రెచ్చిపోయాడా అని కామెంట్స్ వినపడుతున్నాయి.

English summary
Speaking at the success meet of AAa, the comedian Srinivasa Reddy started blasting on websites and went on to advise to buy some stress ball and squeeze them like how female lead Samantha used them in the movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu