»   » ‘శ్రీనివాస కళ్యాణం’ టీం తరుపున శ్రీరామ నవమి విషెస్ తెలిపిన దిల్ రాజు

‘శ్రీనివాస కళ్యాణం’ టీం తరుపున శ్రీరామ నవమి విషెస్ తెలిపిన దిల్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

దిల్ రాజు పేరు ముందు 'దిల్' చేయడానికి కారణం ఆయన నిర్మాణంలో నితిన్ హీరోగా వచ్చిన 'దిల్' చిత్రం భారీ విజయం సాధించడమే. దాదాపు 14 ఏళ్ల తర్వాత నితిన్-దిల్ రాజు కాంబినేషన్లో 'శ్రీనివాస కళ్యాణం' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సోమవారం శ్రీరామ నవమి సందర్భంగా దిల్ రాజు తమ చిత్ర యూనిట్ తరుపున విషెస్ తెలియజేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

ఈ చిత్రానికి శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాన్ని రూపొందించిన‌ డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా, నందిత శ్వేత హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

జూన్‌ వరకు చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయ‌డ‌మే కాకుండా.. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను కూడా కంప్లీట్ చేసి జూలై చివ‌రి వారం లేదా ఆగ‌స్ట్ మొద‌టి వారంలో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కి జె.మేయ‌ర్ సంగీతాన్ని, స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.

Srinivasa Kalyanam - Sri Rama Navami Wishes

నితిన్‌, రాశీఖ‌న్నా, నందితా శ్వేత‌, ప్ర‌కాష్ రాజ్ త‌దిత‌రులు ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రామాంజ‌నేయులు, ఎడిటింగ్‌: మ‌ధు, సినిమాటోగ్ర‌ఫీ: స‌మీర్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ : బండి రత్న కుమార్, సంగీతం: మిక్కి జె.మేయ‌ర్‌, నిర్మాణం: శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, కధ, మాటలు, స్క్రీన్ప్లే, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న‌.

English summary
Srinivasa Kalyanam Team wishes you all a very happy Sri Rama Navami. Directed by Vegesna Satish, Produced by Dil Raju, Shirish, Cast: Nithiin, Raashi, Khanna, Nandita Swetha, Prakash Raj, Music by Mickey J Meyer, Cinematography: Sameer Reddy, Editor: Madhu, Banner: Sri Venkateswara Creations, Digital Media: Nani, PRO: Vamsi Kaka.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X