»   » ‘దూసుకెళ్తా’ మూవీ టాక్ తెలిసిపోయిందోచ్!

‘దూసుకెళ్తా’ మూవీ టాక్ తెలిసిపోయిందోచ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు విష్ణు, లావణ్య త్రిపాఠి జంటగా వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దూసుకెళ్తా'. అక్టోబర్ 17న ఈచిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ దర్శకులైన దాసరి నారాయణరావు, నాగేశ్వరరెడ్డి, శ్రీను వైట్ల, శ్రీవాస్, బి.గోపాల్‌ తదితరులకు స్పెషల్ షో ఏర్పాటు చేసారు.

ఈ సినిమా చూసిన దర్శక ప్రముఖులు సినిమా చాలా బాగా వచ్చిందని, మంచు విష్ణు కెరీర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన 'ఢీ'ని మించిపోయేలా సినిమా ఉంటుందని అంటున్నారు. పలు సీన్లలో విష్ణు అశ్చర్య పరిచాడని, బ్రహ్మానందంతో కలిసి కడుపుబ్బా నవ్వుకునేలా కామెడీ పండించాడని, క్లైమాక్స్‌లో స్టంట్ సీన్లు ఇరగ దీసాడని అంటున్నారు.

గతంలో మంచు విష్ణుతో 'ఢీ' చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీను వైట్ల 'దూసుకెళ్తా' సినిమా గురించి మాట్లాడుతూ.....హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, కామెడీ సీన్లు, యాక్షన్ సీన్లు బాగా వచ్చాయని, ప్రేక్షకులకు వినోదం పంచే విధంగా ఉందని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా విష్ణు కెరియర్‌లోనే అత్యథిక థియేటర్‌లలో భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఢీ, దేనికైనా రెడీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాల తరువాత అదే తరహాలో విష్ణు నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. వీరూ పోట్ల డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం లో మంచు విష్ణు పాత్రకేయుడుగా కనిపిస్తారు. అలాగే డాక్టర్‌ అలేఖ్యగా లావణ్య కనిపిస్తుంది.

ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, పంకజ్ త్రిపాఠి, పోసాని, రఘుబాబు, భరత్, అన్నపూర్ణమ్మ, రజిత, సురేఖావాణి, హేమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:సర్వేష్ మురరి, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఆర్.విజయకుమార్.

English summary
After watching a special preview of the film ‘Doosukeltha’ today, the ace director Srinu Vaitla who directed Vishnu Starrer box office hit Dhee was heard saying, the lines between hero and heroine, good and evil, comedy and thrills, were the stuff that impressed all the way through the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu