»   » అంతా మా నీళ్లలోనే ఉంది: శ్రీను వైట్ల

అంతా మా నీళ్లలోనే ఉంది: శ్రీను వైట్ల

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : కామెడీ అంటే శ్రీను వైట్ల....శ్రీను వైట్ల అంటే కామెడీ అన్నంత పేరు వచ్చేసింది. అసలు శ్రీను వైట్ల లో ఇంత కామెడీ ఎక్కడనుంచి జనరేట్ అవుతోంది...అంటే దానికి సమాధానం ఆయనే చెప్తున్నారు. ఓ తెలుగు దిన పత్రికతో సంభాషిస్తూ తన గతం గుర్తు చేసుకున్నారు.


శ్రీను వైట్ల మాటల్లోనే....'అసలు గోదావరి జిల్లాలంటేనే సినిమా పిచ్చికి పెట్టింది పేరు. ఇక నేనెంత' అంటున్నారు . ఆయన సినిమాల్లో కామెడీ విలక్షణంగా ఉంటుంది. 'వెంకీ, ఢీ, రెడీ, కింగ్, నమో వెంకటేశా, దూకుడు, బాద్‌షా వంటి చిత్రాల్లో కనిపించిన కామెడీ కి మూలం అంతా మా ఊళ్లోనే ఉంది' అంటూ తన సొంతూరు కందులపాలెం గురించి చెబుతున్నారాయన.

తన చిన్న తనం గురించి చెప్తూ... డబ్బులు కొట్టేసి గోదావరి జిల్లాల్లోనే సినిమా పిచ్చి చాలా ఎక్కువ. దానిలో మా ఊరేం తీసిపోదు. చిన్నవయసులోనే నాకు సినిమాలంటే మక్కువ ఏర్పడిందంటే దానికి కారణం మా ఊరే. మా ఊరి నుంచి ద్రాక్షారామం నాలుగు కిలోమీటర్లు. అక్కడ మూడు థియేటర్లుండేవి. అక్కడకెళ్లి సినిమా చూడనివాడు ఊళ్లో ఒక్కడు కూడా లేడంటే న మ్మండి అన్నారు.


అలాగే ...మా చిన్నప్పుడు రిలీజ్ సినిమాలు వచ్చేవి కాదు. దాంతో మా కుర్రాళ్ల బ్యాచ్ అంతా ధైర్యం చేసి ఓ అడుగు ముందుకేసి రామచంద్రపురమో మండపేటో వెళ్లిపోయేవాళ్లం. మరీ కొత్త సినిమా వచ్చింది వచ్చినట్టు చూసెయ్యాలంటే మాత్రం కాకినాడ వెళ్లాల్సిందే. మా అన్నయ్యలు నాకు చెప్పకుండా సినిమా కార్యక్రమం పెట్టుకుంటే మాత్రం నాకు ఎలాగోలాగ తెలిసిపోయేది అన్నారు.

ఇక నేను పొలాలకు అడ్డం పడి పరుగెత్తి వాళ్లను వెంబడించి కలుసుకునేవాణ్ని. 'ఎలాగూ ఇంత దూరం వచ్చాడు పాపం' అనుకుని తర్వాత వాళ్లే సైకిలు మీదెక్కించుకుని తీసుకుపోయేవారు. అందరికన్నా నాకు సినిమా పిచ్చి మరీ ఎక్కువ. డబ్బులు అడిగితే ఇవ్వరని తెలిసి మా నాన్నమ్మ ఎక్కడ దాచుకుంటుందో కనిపెట్టి కొట్టేసేవాణ్ని. మా నాన్న జేబులోంచి కూడా రెండుమూడు సార్లు తీసుకుని సినిమాలకు చెక్కేస్తే తర్వాత తెలిసిపోయి ఉతికేశారు అని చెప్పుకొచ్చారు.

English summary
Srinu Vylta appriaser for his distict that comic sence lies in the Godavari water.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu