»   » త్రాగుడు సీన్స్ ఎందుకంటే...శ్రీను వైట్ల

త్రాగుడు సీన్స్ ఎందుకంటే...శ్రీను వైట్ల

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు శ్రీను వైట్ల చిత్రాల్లో ప్రతీ దాంట్లో త్రాగుడు సీన్ ఉండటం తెలిసిందే. 'ఆనందం' చిత్రం నుంచీ నిన్నటి నమో వెంకటేశ వరకూ ఈ సీన్స్ కంటిన్యూ అవుతున్నాయి. వాటి గురించి శ్రీను వైట్ల రీసెంట్ గా ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే "నేను అద్దె ఇళ్లలో ఉంటుండేవాడిని. ఇంటి యజమాని నన్ను, నా మిత్రులను వేధిస్తుండేవాడు. యజమానిపై పగ తీర్చుకోవాలని ఎన్నో పథకాలు వేస్తుండేవాళ్లం. కానీ అవి ఒక్కరోజు కూడా కార్యరూపం దాల్చలేదు. ఆ పథకాలను 'ఆనందం' చిత్రంలో చూపటానికి ప్రయత్నించాను. దాంతో అది మిగతా చిత్రాల్లో కూడా కొనసాగుతోంది" అని ఆయన నవ్వుతూ వివరించారు.

ఇక పబ్లిక్‌ డిమాండ్‌కు తలొగ్గి వేర్వేరు సన్నివేశాలకు రూపకల్పన చేయాల్సి రావటంతో ఆ ప్రయోగం తలకు మించిన భారమైంది అన్నారు. "నేను తీసిన చిత్రాలన్నింటిలో తాగుడు దృశ్యాలు పరిపాటిగా మారిపోయాయి. నమో వెంకటేశ చిత్రంలో వెంకటేష్‌ మృదుస్వభావం కలిగిన పాత్రను పోషిస్తుండటంతో తాగుడు దృశ్యాల రూపకల్పనలో 10 నుంచి 15 రోజులు వెచ్చించాను. థియేటర్లలో మహిళలు సైతం ఆ దృశ్యాలను ఆస్వాదిస్తున్నారు" అని శ్రీను వైట్ల చెప్పారు. ఇక శ్రీను వైట్ల చిత్రాల్లో పాత్రలు మద్యం సేవించే దృశ్యాలన్నీ కూడా తన నిజ జీవితంలో సంభవించిన సంఘటనలుగా శ్రీను వైట్ల చెప్తూంటారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu