»   » ముహూర్తం సెప్టెంబర్ లోనే... అల్లు శిరీశ్ శ్రీరస్తూ శుభమస్తు రిలీజ్ డేట్

ముహూర్తం సెప్టెంబర్ లోనే... అల్లు శిరీశ్ శ్రీరస్తూ శుభమస్తు రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు శిరీష్‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా, ఫ్యామిలీ లోని చ‌క్క‌టి ఎమెష‌న్స్ ని వెండితెర‌పై క‌థలుగా తెర‌కెక్కించి విజ‌యాలు సాదిస్తున్న ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌(బుజ్జి) ద‌ర్శ‌కుడిగా, ఏస్‌ ప్రోడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారు నిర్మాత‌గా, ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో నిర్మించిన‌ చిత్రం 'శ్రీరస్తు శుభ‌మ‌స్తు'. ఈ చిత్రానికి సంబందించి షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్క‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఇటీవ‌లే విడుద‌ల చేసిన టీజ‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లో థ‌మ‌న్.S.S సంగీతం అందించిన ఆడియో విడుద‌ల చేస్తారు. చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 16న విడుద‌ల చేయ‌టానికి నిర్మాత స‌న్నాహ‌లు చేస్తున్నారు..

ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్(బుజ్జి) మాట్లాడుతూ " అల్లు శిరీష్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఫ్యామిలి ఎమెష‌న్స్ కి విల‌వ‌లు త‌గ్గుతున్న ఈరోజుల్లో, ఫ్యామిలి అంటే ప‌క్కింటి వాడి మేట‌ర్ కాదు మ‌న‌ది మ‌న ఫ్యామిలి, మ‌న అనుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌నైనా సింపిల్ గా సాల్వ్ చేయ‌చ్చు అని తెలియ‌జెప్పె మంచి చిత్రం మా 'శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు'.

Srirastu Subhamastu release on 16 September

ఓ మంచి ఫ్యామిలి లో అన్ని ఎమోష‌న్స్ క‌లిసి వుంటాయి. అలాంటి అన్ని ఎమోష‌న్స్ ని క‌లిపి శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రంలో చూపించాము. శిరీష్ ఎన‌ర్జి సూప‌ర్బ్, లావ‌ణ్య తొ వ‌చ్చే స‌న్నివేశాలు యూత్ ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంభందించి షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌, రావుర‌మేష్‌, సుమల‌త‌, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, , రవి ప్రకాష్, రణధీర్, హంసానందిని, సుమిత్ర లాంటి న‌టీన‌టుల‌తో ఫుల్‌పేక్డ్ గా ఈ చిత్రం చేశాము.

ప్ర‌తి కేర‌క్ట‌ర్ కి ప్రాముఖ్య‌త వుంటుంది. వీరందరి కాంబినేష‌న్ లో వ‌చ్చే ప్ర‌తి స‌న్నివేశం ప్రేక్ష‌కుల్నిఅల‌రిస్తాయి. ఆల్‌రెడి పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఆడియో విడుద‌ల‌ చేయ‌నున్నాము. సెప్టెంబ‌ర్ 16న‌ ప్రేక్ష‌కుల ఆశీర్వ‌చ‌నాల‌కోసం చిత్రాన్ని తీసుకువ‌స్తాము. చ‌క్క‌టి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ కి థ‌మ‌న్.య‌స్‌.య‌స్ సంగీతం అందిస్తున్నారు. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత అల్లు అర‌వింద్ గారికి నా ధ‌న్య‌వాదాలు."అని అన్నారు..

నిర్మాత అల్లు అర‌వింద్ గారు మాట్లాడుతూ .. మా చిత్రం 'శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు ' షూటింగ్ పూర్త‌య్యింది. శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. చక్క‌టి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా మా బ్యాన‌ర్ లో వ‌స్తున్న చిత్ర‌మిది. ఫ్యామిలి ఆడియ‌న్స్ అంద‌రిని అల‌రించే మంచి చిత్రాన్ని ద‌ర్శ‌కుడు బుజ్జి తీసాడు. ఇప్ప‌టికే పాజిటివ్ బ‌జ్ వున్న ఈ చిత్రంలో న‌టీన‌టులంద‌రూ చాలా బాగా న‌టించారు. టీజ‌ర్ కి చాలా మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ అందించిన ఆడియో సినిమాకి ప్ల‌స్ అవుతుంది. త్వ‌ర‌లో ఆడియో ని ప్రేక్ష‌కుల ముందుకి తీసుకువ‌స్తాము. సెప్టెంబ‌ర్ 16న‌ ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాము. "అని అన్నారు.

English summary
According to the latest update Allu Sirish upcoming family entertainer movie"Srirastu Subhamastu" makers have decided to release the movie on 16th September.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu