»   » షూటింగ్ స్పాట్ కొచ్చి కొడతాం.. ఆడదానివని వదిలేస్తున్నాం.. రకుల్‌కు శ్రీరెడ్డి వార్నింగ్

షూటింగ్ స్పాట్ కొచ్చి కొడతాం.. ఆడదానివని వదిలేస్తున్నాం.. రకుల్‌కు శ్రీరెడ్డి వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sri Reddy Warns Rakul Preet Singh On Film Industry Issue

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ వివాదం శ్రీరెడ్డి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మధ్య చిచ్చుపెట్టింది. తనపై కామెంట్స్ చేసిన రకుల్‌పై శ్రీరెడ్డి మండిపడింది. ఇటీవల కాలంలో కాస్టింగ్ కౌచ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ నాకు అలాంటి అనుభవం ఇంత వరకు ఎదురు కాలేదు అని రకుల్ కామెంట్ చేయడంతో ఆమెపై శ్రీరెడ్డి, మాధవీలత భగ్గుమన్నారు. తెలుగు హీరోయిన్ల అవకాశాలు ఇవ్వకుండా ఉత్తరాది వారికి ఆఫర్లు ఇవ్వడం వల్లే పరిశ్రమలోని పెద్దలకు రకుల్ అండగా నిలుస్తారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రకుల్ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిపై మండిపడుతూ రకుల్‌కు పరోక్షంగా శ్రీరెడ్డి హెచ్చరికలు జారీ చేసింది.

రకుల్ కామెంట్స్ ఇవే..

రకుల్ కామెంట్స్ ఇవే..

మాధవీలత, శ్రీరెడ్డి వ్యాఖ్యలపై రకుల్ స్పందిస్తూ.. ఆ ఇద్దరు హీరోయిన్ల గురించి నాకు తెలీదు. వారిని ఏ సినిమాలో కూడా చూడలేదు. అయినా వారంటే నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. నా అనుభవాల గురించే మాత్రమే నేను మాట్లాడాను. టాలీవుడ్‌లో నేను చాలా సురక్షితంగా ఉన్నాను అని రకుల్ అన్నారు.

కబుర్లు చెప్పకు రకుల్ ప్రీత్

కబుర్లు చెప్పకు రకుల్ ప్రీత్

రకుల్ ప్రీత్ సింగ్‌ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి స్పందించారు. ఆమె మాటలు యథాతథంగా... ఉత్తర భారతానికి చెందిన ఒక రెక్క పీత గురించి చెబుదామని వచ్చా. కోట్ల రూపాయలు పెట్టే వారికి అర్హత ఉంటుందని.. టాలెంట‌ెడ్ వాళ్లని ప్రోత్సహిస్తారని కబుర్లు చెప్తోంది అని శ్రీరెడ్డి చెప్పింది.

 రకుల్ నీ గురించి నీకు తెలుసా?

రకుల్ నీ గురించి నీకు తెలుసా?

ఏమే.. నువ్వూ నీ గెడకర్ర మొఖం. చుంచులు పీకేసిన తాటి ముంజ మొఖమొకటేసుకుని, నువ్వు మా ఊళ్లో పిల్లలాడుకునే సైకిల్ టైర్‌లా ఉంటావే. ఒక ఆడదానివని వదిలేస్తున్నాను.. అందుకే తక్కువ మాట్లాడుతున్నాను. అసలు నీకెందుకే మా తెలుగోళ్ల గురించి, మా ఉద్యమాల గురించి అని తీవ్రంగా స్పందించారు.

షూటింగ్ స్పాట్‌కు వచ్చి కొడుతాం..

ఇక్కడకొచ్చి ఏలేద్దామని ఎందుకు ట్రై చేస్తున్నావే నువ్వు. నీకు టాలెంట్ ఉందా.. నీకు లిప్ మూమెంట్ వచ్చా అసలు. అసలు నీ మొఖానికి లంగాఓణీ వేసుకుంటే ఎలా ఉంటావో చూసుకున్నావా. అసలు మా పోరాటాల గురించి నీకెందుకే. వాళ్లు సక్సెసా? ఫెయిల్యూరా? అనేది నీకేందుకు. నోరు మూసుకుని కూర్చో ఇంట్లో. తెలుగు హీరోయిన్లకు కోపం వస్తే నీ షూటింగ్ స్పాట్‌కొచ్చి మరీ కొడతాం అని రకుల్ పరోక్షంగా శ్రీరెడ్డి హెచ్చరించింది.

English summary
Actor Rakul Preet Singh reacts to the accusations made by Telugu actors Maadhavi Latha and Sri Reddy, who recently staged a protest against sexual harassment in Tollywood by stripping. Rakul’s reaction to their accusations is rather interesting. She says that she doesn’t even know them. After Rakul interview, Srireddy warns indirectly her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X