»   » మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా ‘టీమ్ 5’... రిలీజ్ డేట్ ఫిక్స్

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా ‘టీమ్ 5’... రిలీజ్ డేట్ ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆరోపణలతో కళంకితుడైన మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆ దెబ్బతో క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. క్రికెట్ వదిలేసిన తర్వాత సినిమా రంగం వైపు అడుగులు వేసిన శ్రీశాంత్ త్వరలో 'టీమ్ 5' అనే మూవీ ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'టీమ్ 5' చిత్రం తెలుగులో జులై 14న విడుదల కాబోతోంది.

క్రికెట్లో తన పదునైన ఫాస్ట్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించిన శ్రీశాంత్ ఇప్ప‌ుడు వెండితెర‌పై బైక్ రేస‌ర్ గా క‌నిపించబోతున్నాడు. ఈ సినిమా గురించి నిర్మాత రాజ్ జకారియా మాట్లాడుతూ... ఇండియన్ మాజీ స్టార్ క్రికెటర్ శ్రీశాంత్‌ని సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ఆయన అభిమానులంతా ఆశ పడుతున్నారు. ఆ అరుదైన అవ‌కాశాన్ని శ్రీశాంత్ మాకు ఇచ్చినందుకు వారికి మా ధ‌న్య‌వాదాలు. మా కథ, కథనం మీద నమ్మకంతో... ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఉండే క్యారెక్టర్ కావడంతో ఒప్పుకున్నారు అని తెలిపారు.

Srishanth's 'Team 5' release on 14 July

బైక్ రేస‌ర్స్ అయిన ఐదుగురు స్నేహితుల జీవితంలో ఎలాంటి మార్పులు వ‌చ్చాయనే క‌థాంశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాము. మా చిత్రంలో ఫ్రెండ్షిప్, లవ్, ఫ్యామిలీ ఇలా అన్ని ఎమోష‌న్స్ ఉంటాయి. హీరోయిన్ నిక్కీ గల్రానీ, శ్రీశాంత్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని తెలిపారు. టీమ్ 5 అనే టైటిల్ కు తగ్గట్టుగా మా దర్శకుడు సురేష్ గోవింద్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారన్నారని నిర్మాత తెలిపారు.

ఈ చిత్రంలో శ్రీశాంత్. నిక్కీ గల్రానీ, పార్లే మానే, మకరంద్ దేశ్ పాండే తదితరులు నటిస్తున్నారు. బ్యానర్ - సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్, సంగీతం - గోపి సుందర్, ఎడిటర్ - దిలిప్ డెన్నిస్, ఆర్ట్ - సాహస్ బాల, డైరెక్టర్ - సురేష్ గోవింద్, ప్రొడ్యూసర్ - రాజ్ జకారియా.

English summary
Former cricketer Sreesanth is all set to entertain you as an actor. The Telugu-Kannada-Tamil tri-lingual film 'Team 5' will hit the screens on July 14. The movie is produced by Raj Zachariah and directed by Suresh Govind.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu