»   » నా సినిమాలో తప్పులు వెతికారు, ఇప్పుడు ఆయన సినిమాలో వెతకుతా : ఎస్‌.ఎస్‌.రాజమౌళి

నా సినిమాలో తప్పులు వెతికారు, ఇప్పుడు ఆయన సినిమాలో వెతకుతా : ఎస్‌.ఎస్‌.రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ''నా సినిమా చూపిస్తే.. ప్రతీ ఫ్రేములోనూ.. బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ తలపాగా బాగాలేదు.. లైటింగ్ సరిగ్గా లేదు అంటూ ఆయన తప్పులు వెతుకుతారు. ఇప్పుడు నేను కూడా అదే చేస్తాను. వెయిట్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్'' అన్నారు రాజమౌళి. ఇంతకీ ఆయన ఎవరి సినిమాలో తప్పులు పడతానంటున్నారు..ఆయన సినిమాలో ఎవరు తప్పులు వెతుకుతున్నారు అంటే క్రింద విషయం చదవాల్సిందే.

బాహుబలి, బజ్‌రంగీ భాయిజాన్ చిత్రాల కథారచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లీ. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రాజ్‌కుమార్ బృందావనం నిర్మిస్తున్నారు. నిన్న రాత్రి (జనవరి 23న) చిత్ర పాటలను విడుదలచేసారు. ఈ ఆడియో వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా అయ్యారు. ఈ సందర్బంగా పై విధంగా ఆయన కామెంట్ చేసారు.

శ్రీమంతుడు డైరక్టర్ తో ...

శ్రీమంతుడు డైరక్టర్ తో ...

శ్రీలేఖ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం సోమవారం రాత్రి హైదరాబాద్ లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా రాజమౌళి హాజరై తొలి సీడీని ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ థియేట్రికల్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు.

సితారలో పేర్లు చూసుకుని

సితారలో పేర్లు చూసుకుని

రాజమౌళి మాట్లాడుతూ ‘‘మా నాన్నగారిని చూసి గర్వపడిన క్షణాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. రచయితగా ‘జానకిరాముడు' సినిమాకి తొలిసారి తెరపై నాన్న, పెదనాన్న శివశక్తి పేర్లు పడ్డాయి. ఆ సమయంలో మేం సితారలో పేర్లని చూసుకొని, ఆ పత్రికని దేవుడి గుడి దగ్గర పెట్టి పూజ చేసుకొన్నాం అన్నారు.

అప్పుడు తెలియదు కానీ...

అప్పుడు తెలియదు కానీ...

అలాగే 25 ఏళ్ల కిందట నేను నాన్నగారి దగ్గర సహాయ రచయితగా ఉన్నప్పుడు సునామీ నేపథ్యంలో ఓ కథ చెప్పారు. సునామీ అంటే అప్పుడు తెలియదు. ఆ తర్వాత సునామీ వచ్చినప్పుడు, దాని ప్రభావం అర్థమయ్యాక నాన్నగారు అప్పట్లోనే ఇలాంటి కథ చెప్పారా అని మరోసారి గర్వంగా అనిపించింది అన్నారు రాజమౌళి.

సముద్రం అడుగున భూకంపం వచ్చి..

సముద్రం అడుగున భూకంపం వచ్చి..

తన తండ్రి దగ్గర అసిస్టెంట్ గా చేరినప్పుడు.. ఎప్పుడూ ఇంగ్లీష్ నవల్స్ చదివే మీరు ఎందుకిలా తెలుగుబారిన కథలు రాస్తున్నారు అంటే.. ఆయన వెంటనే ఒక కథ చెప్పారట. ''రష్యా వారు యునైటడ్ నేషన్స్ కంట పడకూడదని తమ అణ్వాయుధాలను సముద్రం అట్టడుగున దాచేస్తే.. అక్కడ టెక్టానిక్ ప్లేట్స్ కదిలిపోయి.. సముద్రం అడుగున భూకంపం వచ్చి.. వెంటనే అలలు ఒక సునామీగా మారిపోయి.. జపాన్ ను ముంచెత్తుతాయి. ఇది కనిపెట్టిన అమెరికా.. సునామీ భారిన పడకుండా ఏం చేస్తుంది?'' అనేదే కథ. అయితే ఎక్కడో సునామీ వచ్చి ఇండియాలో అది బీభత్సం సృష్టించనప్పుడు.. మా నాన్న గారు ఇలాంటి కథను 25 ఏళ్ళ క్రిందటే చెప్పారే.. సునామీ అనే పేరును అప్పుడే నాతో అన్నారే.. అంటూ రాజమౌళి చాలా గర్వపడ్డానని చెప్పారు.

రెండు వారాల గ్యాప్ లో ..

రెండు వారాల గ్యాప్ లో ..

ఇండియాలోనే రెండు బిగ్గస్టు బ్లాక్ బస్టర్లు అయిన బాహుబలి అండ్ భజరంగీ భాయ్ జాన్ లు రెండు వారాల గ్యాపులో రిలీజ్ కావడం.. ఆ రెండింటికీ మా తండ్రి కథలే ఉండటం.. నాకు చాలా గర్వాన్ని కలిగించిందని చెప్పుకొచ్చాడు రాజమౌళి.

స్క్రిల్స్ అవసరం అని చెప్పా

స్క్రిల్స్ అవసరం అని చెప్పా

ఇలా జీవితంలో నాన్నగారి విషయంలో నేను గర్వపడ్డ క్షణాలు చాలానే ఉన్నాయి. ‘శ్రీవల్లీ' కథ ముందే నాకు చెప్పారు. ఆలోచన బాగుంది కానీ... ఇలాంటి కథల్ని తీయాలంటే దర్శకత్వం పరంగా స్కిల్స్‌ అవసరమవుతాయి అని చెప్పా. ఆయన ఎంతో నమ్మకంతో ఈ సినిమాని తీశారు. ఆయన చేసిన మార్పులతో ఈరోజు మళ్లీ కథ చెప్పారు. గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో కూడిన మంచి కథ అనిపించింది అన్నారు రాజమౌళి.

మా నాన్నని పోటీగానే భావిస్తా

మా నాన్నని పోటీగానే భావిస్తా

ఈ సినిమా విజయవంతమైతే ఇప్పుడు చెప్పిన అన్ని క్షణాల కంటే గర్వంగా అనిపిస్తుంది. అయితే అది కూడా ఓ కొడుకుగానే. దర్శకుడిగా మాత్రం నాన్నని పోటీగానే భావిస్తా. నా సినిమా చూసినప్పుడు ఆయన ప్రతి ఫ్రేమ్‌లో తప్పులు వెదుకుతుంటారు. ఆ తప్పులు నేను కూడా వెదకడానికి ఎదురు చూస్తున్నా'' అన్నారు.

ఆ అవకాసం దక్కలేదు

ఆ అవకాసం దక్కలేదు


విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘కథ ఎలా రాయాలని చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటారు. కథంటే ఓ అబద్ధం అని నేను సరదాగా చెబుతుంటా. ఒక అబద్ధానికి ఇంకొక అబద్ధం జోడిస్తూ వెళ్లాలి. అవన్నీ కలిస్తే నిజం అనిపించాలి. అందరికంటే నేనే బాగా అబద్ధాలు చెప్పాలని, అందరికంటే నేనే ముందుండాలని 20 ఏళ్లుగా పరుగు పెడుతున్నా. కానీ నాకు ఆ అవకాశం దక్కలేదు.

అప్పుడే ప్రపంచం

అప్పుడే ప్రపంచం

ఏడాదిన్నర కిందట ఒక వారం వ్యవధిలో ‘బాహుబలి', ‘బజరంగీ భాయీజాన్‌' సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ రెండు చిత్రాలూ ఘన విజయం సాధించాయి. ప్రపంచమంతా పెద్ద అబద్ధాల కోరు అని నన్ను గుర్తించింది అన్నారు విజయేంద్రప్రసాద్.

మచ్చ వేసే అర్హత లేదు

మచ్చ వేసే అర్హత లేదు

ఏ తండ్రి అయినా కొడుకుకి ఆస్తి, చదువు, అంతస్తు ఇవ్వకపోయినా పర్లేదు కానీ... ఏ తండ్రీ తన కొడుక్కి తన ప్రవర్తన ద్వారా మచ్చ వేసే అర్హత లేదు. నా బిడ్డ ఉన్న స్థాయికి వాడిని ఇక్కడికి ఏదో రెండు మాటలు చెప్పి నా సినిమా గురించి అందరినీ నమ్మించడం పాపం. కానీ ఒకటి చెప్పగలను. ఇంతవరకు భారతీయ చరిత్రలో ఏ సినిమాలో రాని కథ ఇందులో ఉందని గర్వంగా ఆత్మ విశ్వాసంతో చెబుతున్నా. మనసు గురించి చెప్పే కథ ఇది'' అన్నారు విజయేంద్రప్రసాద్.

కొడుకుతో పోటీ పడుతున్నందుకు...

కొడుకుతో పోటీ పడుతున్నందుకు...

రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘విజయేంద్రప్రసాద్‌ మనసుపై కథతో ఈ సినిమాని తీశారు. తనయుడు రాజమౌళి ఆకాశంలో ఉన్నారు, ఆయనతో పోటీపడుతున్నందుకు విజయేంద్రప్రసాద్‌ని అభినందించాలి. కొడుకుమీద గెలవడానికి ప్రయత్నిస్తున్న విజయేంద్రప్రసాద్‌ కోరిక తీరాలని ఆకాంక్షిస్తున్నా'' అన్నారు.

హాయిగా ఉన్నాయి

హాయిగా ఉన్నాయి

ఎమ్‌.ఎమ్‌.కీరవాణి మాట్లాడుతూ ‘‘పాటలన్నీ ఫాస్ట్‌బీట్‌ లేకుండా చాలా మెలోడియస్‌గా ఉన్నాయి. కథకీ, కథనానికి బలం చేకూర్చడానికే చేసినట్టుగా హాయిగా ఉన్నాయి. ముప్పయ్యేళ్ల కిందట సంగీత దర్శకుడు సి.రాజమణిగారి దగ్గరికి వెళ్లా. ఆయన నన్ను, నా పనితీరుని పరిశీలించి ‘మేం ‘రోమాంచన' అనే సినిమా కోసం బెంగుళూరు వెళుతున్నాం. ట్రూప్‌లో ఒకరు రాలేదు, ఆ స్థానంలో నువ్వు వచ్చేసెయ్‌' అన్నారు. వెళ్లడానికి సిద్ధమైన తరుణంలో నువ్వు రావొద్దులే' అన్నారు. ఆ సమయంలో నిరుత్సాహపడిపోయి ఇంట్లో ఉన్నా.

చిన్నాన్నగారి వల్లే..

చిన్నాన్నగారి వల్లే..

అప్పుడు మా చిన్నాన్నగారు విజయేంద్రప్రసాద్‌ ‘వాళ్లు పిలవకపోయినా వాళ్లకంటే ముందే వెళ్లి అక్కడుండు అన్నారు. ఆయన చెప్పినట్టే రైలెక్కి బెంగుళూరు వెళ్లా. రాజమణిగారు సంతోషించి నన్ను పనిలో చేర్చుకొన్నారు. అతను ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు అని మనం కథల్లో విన్నాం. కానీ మా చిన్నాన్నగారివల్ల ‘నేనెక్కాల్సిన రైలు ఒక జీవితకాలం ముందర' అన్నమాట. అటువంటి మా చిన్నాన్నగారు చేసిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకొంటున్నా'' అన్నారు కీరవాణి.

పోటీ పడుతూ..

పోటీ పడుతూ..

కొరటాల శివ మాట్లాడుతూ ‘‘విజయేంద్రప్రసాద్‌గారు, రాజమౌళి కుటుంబం అంటే భారతదేశంలో సినిమా పట్ల తపన ఉన్న ఓ గొప్ప కుటుంబం. కొత్త తరంతో పోటీ పడుతూ రాస్తున్నారు విజయేంద్రప్రసాద్‌గారు. ఆయన మరిన్ని స్ఫూర్తినిచ్చే చిత్రాలు చేయాలని కోరుకొంటున్నా'' అన్నారు.

పెదనాన్నతో రెండో సారి

పెదనాన్నతో రెండో సారి

శ్రీలేఖ మాట్లాడుతూ ‘‘నా పాటల వేడుకకి తొలిసారి రాజమౌళి అన్న ముఖ్య అతిథిగా వచ్చారు. అది ఆనందంగా ఉంది. విజయేంద్రప్రసాద్‌ పెదనాన్నతో రెండోసారి చేస్తున్నా. చాలా వేగంగా ఈ బాణీలు చేశాన''అన్నారు.

ఈ పంక్షన్ లో ..

ఈ పంక్షన్ లో ..

ఈ కార్యక్రమంలో శివశక్తి దత్తా, రాజీవ్‌ కనకాల, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, శిబు, బి.వి.ఎస్‌.రవి, చెర్రీ, వక్కంతం వంశీ, శ్రీచరణ్‌, వరప్రసాద్‌, భారతీబాబు, అనంతశ్రీరామ్‌, జొన్నవిత్తుల, హేమ, చైతన్యప్రసాద్‌, కోనేరు ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

English summary
Srivalli is an upcoming movie in Tollywood and this movie is directed by writer V Vijayendra Prasad. Rajath played the lead role in this film, while Sreelekha played the female lead opposite Rajath. This movie is produced by B V S N Rajukumar, under the banner of Reshmas Arts and the music for this film is composed by M M Sreelekha.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu