»   » ట్విట్టర్ లో భాయ్..భాయ్‌: స్టార్ హీరో ఫస్ట్‌లుక్‌పై మరో స్టార్ హీరో ట్వీట్‌

ట్విట్టర్ లో భాయ్..భాయ్‌: స్టార్ హీరో ఫస్ట్‌లుక్‌పై మరో స్టార్ హీరో ట్వీట్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: సల్మాన్‌ ఖాన్‌ సినిమా పోస్టరును షారుఖ్‌ ట్వీట్‌ చేస్తే... అది చాలా పెద్ద వింత. తాజాగా అదే జరిగింది. సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'బజరంగీ భైజాన్‌' సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టరును షారుఖ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. దీంతోపాటు ''ఒక హీరోగా ఉండటం కంటే అన్నగా ఉండటమే గొప్ప.'భైజాన్‌' ఈ రంజాన్‌కు మీ ముందుకొస్తున్నాడు. ఫస్ట్‌ లుక్‌ ఎలా ఉంది'' అని రాసుకొచ్చాడు షారుఖ్‌. ఆ ట్వీట్ మీరూ చూడండి...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సల్మాన్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా రూపొందుతున్న బాలీవుడ్‌ సినిమా 'భజరంగి భాయిజాన్‌'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌పై షారుక్‌ ఖాన్‌ ట్వీట్‌ చేశారు. 'హీరోగా ఉండడం కంటే సోదరుడిగా ఉండడమే చాలా గొప్ప విషయం అని నమ్ముతున్నా. 'భాయిజాన్‌' 2015 ఈద్‌కు విడుదలవుతుంది. ఫస్ట్‌ లుక్‌ నచ్చిందా?' అంటూ షారుక్‌ ఖాన్‌ ట్విట్టర్‌లో సల్మాన్‌ ఖాన్‌ ఫొటో పోస్ట్‌ చేశారు. ఈ లింక్‌ను సినిమా దర్శకుడు కబీర్‌ ఖాన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

SRK and Salman say bhai-bhai for Bajarangi Bhaijaan

సల్మాన్‌పై సోదరప్రేమ చూపుతూ షారుక్‌ ట్విట్టర్‌లో ఫస్ట్‌లుక్‌పై ఇలా కామెంట్‌ చేయడం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ముఖ్యంగా హీరోలు తమ సినిమాల ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లను ఆన్‌లైన్‌ విడుదల చేయడం సాధారణం. దాన్ని ఇతర హీరోలు షేర్‌ చేయడమూ ఇంకా సాధారణం. అదే ఒక హీరో సినిమా ఫస్ట్‌ లుక్‌ను మరో హీరో ట్విట్టర్‌లో పోస్టు చేస్తే అది వింత...అదిప్పుడు బాలీవుడ్ లో జరిగింది అంటున్నారు.

ఈ పోస్టరులో సల్మాన్‌ ముఖం మొత్తం కనిపించకుండా కేవలం గెడ్డం వరకే కనిపిస్తోంది. మెడలో ఒక చిన్న గద ఉంది. పోస్టరు విషయం పక్కనపెడితే దీన్ని షారుఖ్‌ విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవలే జమ్మూకశ్మీర్‌లో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్‌ త్వరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

English summary
Here comes the much bigger surprise. Just a while ago, Shah Rukh launched the first look poster of Sallu Bhai's upcoming film, Bajrangi Bhaijaan, and tweeted, 'I believe Being a brother is bigger than being a Hero. 'Bhaijaan' coming Eid 2015. How do u like the first look?' .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu