»   » షారుక్‌ను ఎవరు కాదనుకుంటారు? బాహుబలి-2లో గెస్ట్ రోల్‌పై ...స్పందన!

షారుక్‌ను ఎవరు కాదనుకుంటారు? బాహుబలి-2లో గెస్ట్ రోల్‌పై ...స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'బాహుబలి-2' త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో బాలీవుడ్ స్టార్ ను భాగం చేస్తున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.

రెండు మూడు రోజులుగా ఈ చిత్రంలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడంటూ.... జాతీయ మీడియాలో సైతం వార్తలు రావడంతో బాహుబలి చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా స్పందించింది. షారుక్ లాంటి పెద్ద స్టార్ మా సినిమాలు ఉండటం మాకూ ఇష్టమే, ఆయన్ను ఎవరు మాత్రం కాదనుకుంటారు. కానీ అలాంటి అవకాశం ఈ సారి దక్కలేదు. ఆయన మా సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని బాహుబలి చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది.

ఒక్కసారిగా నిరాశ

బాహుబలి-2లో షారుక్ నటిస్తున్నాడనే వార్తలు కొంతకాలంగా వస్తుండటంతో ఆయన అభిమానుల్లో ఏదో తెలియని ఆనందం. అయితే ఆయన సినిమాలో లేడనే విషయం తెలియగానే చాలా మంది అభిమానుల్లో ఉన్న ఆ ఆనందం కాస్త ఆవిరైంది.

ఇవన్నీ మామలే..

ఇవన్నీ మామలే..

బాహుబలి లాంటి పెద్ద ప్రాజెక్టులు రిలీజ్ అవుతున్న వేళ ఇలాంటి ప్రచారాలు జరుగడం మామూలే. గతంలో సూర్య, మోహన్ లాల్ పేర్లు కూడా వినిపించాయి. ఏది ఏమైతేనేం ఎట్టకేలకు బాహుబలి టీం స్పందించింది. ఇందులో నిజం లేదని వివరణ ఇచ్చింది. దీంతో అభిమానుల్లో ఉన్న అనుమానాలు తొలగిపోయినట్లయింది.

‘బాహుబలి-2’ లాస్ట్ డే షూట్, గుమ్మడి కాయతో ప్రభాస్ ఇలా... (ఫోటోలు)

‘బాహుబలి-2’ లాస్ట్ డే షూట్, గుమ్మడి కాయతో ప్రభాస్ ఇలా... (ఫోటోలు)

బాహుబలి సినిమా కోసం ప్రభాస్... ఇప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో ఏ హీరో కూడా తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా మూడున్నర సంవత్సరాలు కేవలం ఈ సినిమా కోసమే కేటాయించారు. ప్రభాస్ శ్రమకు తగిన ఫలితమే దక్కింది. పూర్తి వివరాలు, బాహుబలి షూటింగ్ లాస్ట్ డే షూటింగ్ కోసం క్లిక్ చేయండి.

రూ. 150 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ న్యూ మూవీ ప్రారంభం.. (ఫోటోస్)

రూ. 150 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ న్యూ మూవీ ప్రారంభం.. (ఫోటోస్)

దాదాపు మూడున్నరేళ్లుగా'బాహుబలి' ప్రాజెక్టే పరిమితమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.... ఆ సినిమా షూటింగ్ పూర్తవడంతో అందులో నుండి బయటకు వచ్చి ఇతర సినిమాలపై దృష్టి సారించారు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం సోమవారం ఉదయం ప్రారంభం అయింది. యూవి క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం దాదాపు రూ. 150 కోట్ల తో తెలుగు, తమిళం, హిందీల్లో ఒకే సారి చిత్రకరించనున్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు... పూర్తి వివరాలు, ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

ప్రభాస్ పెళ్లి విషయం ఖరారు చేసిన కృష్ణం రాజు

ప్రభాస్ పెళ్లి విషయం ఖరారు చేసిన కృష్ణం రాజు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గడియలు దగ్గర పడ్డాయి. అభిమానులు మరెన్నో రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇక మరికొన్ని నెలలు మాత్రమే... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
"We would have loved to have iamsrk in our movie ! Who wouldn't ? But unfortunately it's a rumour! Not true ! Baahubali2" Baahubali team tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu