»   » ఆమెకు ఖరీదైన కారు గిఫ్టుగా ఇచ్చిన స్టార్ హీరో (ఫోటో)

ఆమెకు ఖరీదైన కారు గిఫ్టుగా ఇచ్చిన స్టార్ హీరో (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, ఫరా ఖాన్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. తాజాగా షారుక్ ఖాన్ ఫరా ఖాన్ కోసం ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ క్లాస్సీ బ్లాక్ కారు కొనిచ్చారు. ఇటీవల ఫరా ఖాన్ కారు యాక్సిడెంటుకు గురై పాడైంది. దీంతో ఆమె కొంత కాలంగా షారుఖ్ ఖాన్‌కు చెందిన వోక్స్ వ్యాగన్ కారును తన పర్సనల్ పనుల కోసం వాడుతోంది.

గత కొంత కాలంగా షారుక్ ఖాన్ వాడుతున్న ఫరా ఖాన్ కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన షారుక్.....తన బెస్ట్ ఫ్రెండ్ కోసం ఏకంగా కొత్త కారు కొనిఇచ్చి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌కె క్లాస్ కారు ఖరీదు దాదాపు రూ. 25 లక్షలు ఉంటుందని అంచనా.

SRK Surprises Farah Khan By Gifting A Classy Mercedes!

ప్రస్తుతం షారుక్ ఖాన్, ఫరాఖాన్ దర్శకత్వంలో 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం చేస్తున్నారు. ఇటీవల షారుక్ ఆమెను తన ఆఫీసుకు రమ్మని కబురు పంపారు. ఆమె ఆఫీసుకు వచ్చిన తర్వాత ఓ సర్ ఫ్రైజ్ అంటూ....ఈ కారును గిఫ్టుగా ఇచ్చారు. తన బెస్ట్ ఫ్రెండ్ షారుక్ నుండి కారు గిఫ్టుగా అందుకున్న ఫరా ఖాన్ చాలా ఆనంద పడింది.

గిఫ్టు అందుకున్న వెంటనే షారుక్ ఖాన్, ఫరా ఖాన్ కలిసి డ్రైవ్‌కు వెళ్లారు. తన జీవితంలో ఇదొక మరుపురాని సంఘటన అని, అతనితో డ్రైవ్‌కు వెళ్లిన సమయంలో గ్రేట్ ఫన్ ఎంజాయ్ చేసామని ఫరా ఖాన్ చెప్పుకొచ్చారు. ఫరా ఖాన్‌కు కారు గిఫ్టుగా ఇవ్వడం షారుక్‌కు ఇది కొత్తేమీ కాదు. గతంలో 'మై హూ నా' చిత్రం సమయంలోనూ, ఆ తర్వాత 'ఓం శాంతి ఓం' చిత్రం సమయంలోనూ రెండు కార్లు గిఫ్టుగా ఇచ్చారు షారుక్. ఈ రెండు చిత్రాలకు ఫరా ఖాన్ దర్శకత్వం వహించారు.

'హ్యాపీ న్యూ ఇయర్' సినిమా విశేషాల్లోకి వెళితే..... ఫరా ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, దీపిక పదుకోన్ జంటగా నటిస్తున్నారు. అభిషేక్ బచ్చన్, బోమన్ ఇరానీ, సోనూ సూద్, వివాన్ షా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

English summary
Everybody knows about strong friendship between Shahrukh Khan and Farah Khan and as a token of friendship SRK has recently gifted a classy black Mercedes to the director friend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu