twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామానాయుడికి పద్మభూషణ్-శ్రీదేవి, బాపులకు పద్మశ్రీ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే 'పద్మ' అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. తెలుగు సినీరంగానికి సంబంధించి ముగ్గురు ప్రముఖులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులు దక్కింది. అందులో ఒకరు మూవీ మొఘల్ రామానాయుడు కాగా, మరొకరు ప్రఖ్యాత దర్శకుడు బాపు. రామానాయుడికి పద్మ విభూషణ్ అవార్డు దక్కగా, బాపుకు పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. అదే విధంగా నటి శ్రీదేవికి పద్మశ్రీ అవార్డు దక్కింది.

    రేపు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందింన వారికి అవార్డులు ప్రకటించారు. తెలుగు సినిమా ప్రముఖులైన రామానాయుడు, బాపులకు అవార్డులు దక్కండంపై పలువురు సినీ సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    మూవీ మొఘల్‌గా ఇప్పటికే రామానాయుడు ఖాతాలో ఎన్నో అవార్డులు ఉన్నాయి. ఎనిమిది భాషల్లో సినిమాలు నిర్మించిన ఘనత సొంతం. 2010లో రామానాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ లభించింది. నిర్మాతగా 130 సినిమాల గిన్నిస్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. అనురాగం సినిమాకు నిర్మాతగా మొదటి చిత్రం ప్రారంభించిన రామానాయుడు ఎన్టీఆర్‌కి రాముడు-భీముడు బ్లాక్ బస్టర్ తో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన అక్కినేనితో తీసిన ప్రేమ్‌ నగర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వెంకటేశ్వర యునివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందడంతో పాటు, 13వ లోక్‌ సభలో కారంచేడు నుంచి ఎంపీగా సేవలు అందించారు.

    దర్శుడు బాపు గురించి ఎంత చెప్పినా తక్కువే. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం. 'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటముతొ పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలొ నిలిచిపొయాయనటం పొగడ్త కాదు. క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపొయిన, తీసిన సినిమాలొ దర్శకుడిగా ఈయన పేరు చూడక పొయినా చప్పున ఎవరయినా ఇది గీసింది, తీసింది బాపూ అని గుర్తించగలి గేటంత విలక్షణమయిన శైలి బాపు ప్రత్యేకత.

    ప్రముఖ హీరోయినశ్రీదేవి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. భారతీయ సినీ పరిశ్రమలో బాగా పాపులారిటీ సంపాదించిన టాప్ హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు. దేశంలోని అన్ని భాషల చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి. ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ, మళయాలం, కన్నడ చిత్రాల్లో శ్రీదేవి తనదైన ముద్ర వేసింది.

    English summary
    Dr D Ramanaidu was honoured with the Padma Bhushan and veteran director Bapu, Sridevi honoured with the Padma Sri award.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X