»   » కాస్టింగ్ కౌచ్: నీచ సంస్కృతి ఇంకా సాగుతోందన్న హీరోయిన్!

కాస్టింగ్ కౌచ్: నీచ సంస్కృతి ఇంకా సాగుతోందన్న హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా అవకాశాల కోసం శారీరకంగా లొంగిపోవడం (కాస్టింగ్ కౌచ్) లాంటి నీచమైన పనుల గురించి చాలా సార్లు విన్నాం. అయితే కొందరు ఇలాంటివి గతంలో జరిగేవని ఇపుడు అలాంటివి జరుగడం లేదని అంటుంటారు.

అయితే పాపులర్ కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ సినీ పరిశ్రమలో ఇలాంటివి ఇంకా సాగుతున్నాయని సంచలన కామెంట్ చేశారు. కన్నడ సినీ పరిశ్రమలోనూ ఇవి సర్వసాధారణంగా జరిగేదే అని ఇటీవల ఓ టీవీ షోలో చెప్పుకొచ్చారు.

కాస్టింగ్ కౌచ్

కాస్టింగ్ కౌచ్

అకుల్ బాలాజీ హోస్ట్ చేస్తున్న ‘సూపర్ టాక్ టైమ్' అనే కన్నడ రియాల్టీ షోలో శృతి హరిహరన్ మాట్లాడుతూ.... కాస్టింగ్ కౌచ్ అనేది జరిగిపోయిన గతం కాదు. ఇండస్ట్రీలో ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయి అని తెలిపారు.

Shruti Hassan Teaching Life Truths | Filmibeat Telugu
నీలో టాలెంట్ ఉంటేనే

నీలో టాలెంట్ ఉంటేనే

ఒక సినిమాలో మీకు అవకాశం వచ్చిందంటే మీ పెర్ఫార్మెన్స్, యాక్టర్ గా మీలో ఉండే టాలెంటును చూసే ఇస్తారు. కాస్టింగ్ కౌచ్ ద్వారా ఒకటి రెండు అవకాశాలు వస్తాయేమోగానీ, నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే మీలో టాలెంట్ ఉన్నపుడే అది సాధ్యం. కొందరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయ్యేందుకు ఇలాంటి విషయాల్లో కాంప్రమైజ్ అవుతున్నారు అని శృతి హరిహరన్ తెలిపారు.

గతంలో తెలుగు ఇండస్ట్రీపై ఆరోపణలు

గతంలో తెలుగు ఇండస్ట్రీపై ఆరోపణలు

తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంస్కృతి చాలా దారుణంగా ఉన్నట్లు కన్నడ నటి శృతి హరిహరన్ గతంలో కామెంట్స్ చేసి వార్తలకెక్కింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్లకు గౌరవం ఎవ్వరూ ఇవ్వరని తెలిపింది.

డైరెక్టుగా అడుగుతారు

డైరెక్టుగా అడుగుతారు

తాను తెలుగు సినిమాలు చేయకపోయినా, తనకు ఇక్కడ విషయాలు తెలుసని, చాలా విన్నానని, కోరిక తీర్చమని డైరక్ట్ గా అడుగుతారని, ఇక్కడ కాంప్రమైజ్ కాకపోతే హీరోయిన్ గా నిలబడలేరని,అందుకే తెలుగు సినీపరిశ్రమ అంటే తనకి చాలా భయం అని కామెంట్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

ఎవరికీ తలవంచను

ఎవరికీ తలవంచను

తమిళం, కన్నడ చిత్ర పరిశ్రమలతో పోలిస్తే.... తెలుగులో కాస్తింగ్ కౌచ్ సంస్కృతి ఎక్కువ శృతి హరిహరన్ తెలిపారు. అవకాశాల కోసం ఎవ్వరి ముందు తల వంచాల్సిన అవసరం తనకి లేదని శృతి తెలిపారు.

English summary
While many say that there is no such thing as casting couches and all these are created to malign the image of Sandalwood and a certain set of people, popular Kannada actress Sruthi Hariharan has confessed that perverts and casting couches do exist in Sandalwood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu