»   » 'శ్రీమంతుడు' గురించి ముందే చెప్పా : శృతి హాసన్

'శ్రీమంతుడు' గురించి ముందే చెప్పా : శృతి హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ''ఎప్పటికీ మరిచిపోలేని ఓ మంచి సినిమా అవుతుందని నేను ముందే చెప్పా. అనుకొన్నట్టుగానే సినిమా విజయం సాధించింది. మహేష్‌ లాంటి ఓ అద్భుతమైన నటుడితో కలిసి సినిమా చేయడం సంతోషంగా ఉంది'' అన్నారు శ్రుతి హాసన్‌.

మహేష్‌ బాబు, శ్రుతిహాసన్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో నిర్మించిన 'శ్రీమంతుడు' చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మార్నింగ్ షో నుంచే చిత్రం సూపర్ హిట్ టాక్ ని మోసుకుని వచ్చి కలెక్షన్స్ తో భాక్సాఫీస్ ని అదరకొడుతోంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో ఇలా స్పందించారామె.


దర్శకుడు మాట్లాడుతూ.....''అందరికీ నచ్చేలా ఓ మంచి సినిమా తీయాలనుకొన్నా. మేం అనుకొన్నట్టుగా అన్ని వర్గాల ప్రేక్షకులూ ఆదరిస్తున్నారు. ఇలాంటి కథను నమ్మి చేసిన మహేష్‌బాబుగారికి నా కృతజ్ఞతలు'' అన్నారు దర్శకుడు కొరటాల శివ.


అలాగే దర్శకుడు కంటిన్యూ చేస్తూ.... ''అందరి నుంచీ సినిమా బాగుందన్న మాటే వినిపిస్తోంది. ఆ స్పందనతో మేం పడ్డ కష్టమంతా మరిచిపోతున్నాం. మహేష్‌ని సున్నితంగా చూపిస్తూనే కథలో అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తపడ్డాం. 'శ్రీమంతుడు'తో మహేష్‌బాబు తమిళంలోకి ప్రవేశించడం ఆనందంగా ఉంది. విదేశాల్లోనూ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది''అన్నారు.


జగపతిబాబు మాట్లాడుతూ ''సినిమా మేం వూహించినదానికంటే గొప్ప విజయం సాధించింది. అప్పట్లో నేను చేసిన 'శుభలగ్నం' గుర్తుకొచ్చింది. కుటుంబ ప్రేక్షకులంతా సినిమా చూసేందుకు వస్తున్నారు. నటీనటులు, సాంకేతిక బృందంలోని ప్రతి ఒక్కరికీ ఈ విజయంలో భాగం ఉంది'' అన్నారు.


నిర్మాతలు మాట్లాడుతూ ''మా సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రమే ఘన విజయం సాధించడం ఆనందంగా ఉంది. పైరసీని ప్రోత్సహించకుండా సినిమాని థియేటర్‌లోనే చూడాలి''అన్నారు.


ప్రేక్షకులనుండి తమ సంస్థ నిర్మించిన తొలి చిత్రానికి మంచి టాక్ రావడం ఆనందంగా ఉందని, అన్ని కేంద్రాల్లో మంచి రిపోర్టులు వస్తున్నాయని, భారతదేశంలోనే కాక యుఎస్‌ఎ, ఓవర్‌సీస్‌లో విజయఢంకా మ్రోగిస్తోందని ఆయన తెలిపారు.


Sruthi Hassan about Mahesh's Srimanthudu

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


మరో ప్రక్క ఈ సినిమాకు మంచి ప్రశంసలు వస్తున్నాయని, జీవితంలో ఈరోజు చాలా సంతోషకరమైందంటూ మహేష్‌ బాబు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.


మహేష్ మాట్లాడుతూ...గత చిత్రాల ఫలితాల ప్రభావం తదుపరి సినిమాలపై తప్పకుండా ఉంటుంది. పరాజయాల తర్వాత వస్తోన్న సినిమా హిట్ కావాలని ప్రతి హీరో కోరుకుంటాడు. కానీ శ్రీమంతుడు సినిమా ఫలితం విషయంలో మాత్రం నాకు ఆ భయాలన్ని తొలగిపోయాయి. ఊరిని దత్తత తీసుకోవడం అనే యూనివర్సల్ పాయింట్ విజయంపై నా నమ్మకాన్ని పెంచింది. బలమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలోని భావోద్వేగాలు అందరిని మెప్పిస్తాయనే నమ్మకముంది అన్నారు హీరో మహేష్‌బాబు.


దర్శకుడు మాట్లాడుతూ ''మహేష్‌బాబు పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఆకట్టుకొంటాయి. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మహేష్‌ చాలా సింపుల్‌గా కనిపిస్తారు. కానీ స్త్టెలిష్‌గా ఉంటారు. శ్రుతిహాసన్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, సుకన్య... ఇలా ప్రతిపాత్రా కీలకమైనదే. సంభాషణలూ కథకి తగ్గట్టే వినిపిస్తాయి. అవసరాన్ని మించి పంచ్‌ సంభాషణలుండవు'' అన్నారు.


జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి,


కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
Srimanthudu Movie featuring Mahesh Babu, Shruti Haasan. Directed by Koratala Siva and music composed by DSP produced by Mythri Movie Makers.
Please Wait while comments are loading...