»   »  శృతీహసన్ ని "బెండకాయక్కా" అని పిలిచేవారట....

శృతీహసన్ ని "బెండకాయక్కా" అని పిలిచేవారట....

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని చాలా మంది నమ్మే విషయం. చాలా వింతనమ్మకాల లాగే బెందకాయ తింటే 'లెక్కలు బాగా వస్తాయి' అనే నమ్మకం కూడా ఒకటి. ఈ మాట ముందెవరు చెప్పారో గానీ బెండకాయంటే ఇష్టం లేని పిల్లలకి కూడా నోరెత్తకుండా తినాలంటే తల్లులందరికీ ఇదో తారక మంత్రం అయ్యింది. బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయ్..! అని చెప్పటం ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. ఇదే నమ్మకం తమిళనాడులో కూడా ఎక్కువే అన్న విషయం ఈ మధ్యే శృతీహసన్ చెప్పేసింది.

మన మేడం లెక్కల్లో జెమ్ అట... అంటే అర్థమయ్యింది కదా అందుకే లెక్కలు బాగా రావాలని శ్రుతి లంచ్ కీ, డిన్నర్‌కీ కూడా బెండకాయలనే తినేసేదట. బెండకాయ విశయం చెప్తూ... ''ఏం వండాలి? అని మా అమ్మ అడిగిన ప్రతిసారీ నేను 'వెండక్కాయ్‌' (తమిళ్ లో బెండని వెండక్కయ్ అంటారు) అనేదాన్ని.

Sruthi husan said about her school days

మా కుటుంబంలో చాలా మందితో పోలిస్తే నేనే పెద్దదాన్ని. అందరూ నన్ను అక్క అని పిలిచేవారు. 'ఏ అక్క' అని ఎవరైనా అడిగితే 'వెండకాక్కా' అని వెండకాయ్‌ను, అక్కను కలిపి పలికేవారు. ఇక లెక్కల సంగతి అంటారా? లెక్కల్లో వందకి ఎక్కువలో ఎక్కువగా నాకు 26 మార్కులు వచ్చాయి.

Sruthi husan said about her school days

అతి తక్కువగా 2 మార్కులు వచ్చాయి. ఇప్పటికీ బెండకాయల్ని చాలా ఇష్టంగా తింటాను. అయినా అకౌంట్స్‌లో వీక్‌గానే ఉన్నా. కాబట్టి తేలిందంటంటే లెక్కలు రావాలంటే కష్టపడి చదువుకోవాలి కానీ, ఏవో తింటే వస్తాయనుకోవడం పొరపాటు'' అని వివరించింది శ్రుతీహాసన్. అదే మరి బెండకాయ తింటే లెక్కలూ, తినడం మానేస్తే సినిమా చాన్సులూ వస్తాయనుకోవటం అమాయకత్వమే కదా...

English summary
Tollywood beauty Sruthi Hasan shared about her school days and funny things she did
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu