»   » ఊహించలేదిలా..! చిరు పక్కన అనుష్కని వద్దన్నారట

ఊహించలేదిలా..! చిరు పక్కన అనుష్కని వద్దన్నారట

Posted By:
Subscribe to Filmibeat Telugu
'ఖైదీ నం150'తో బాక్సాఫీస్ కి మళ్ళీ ఒక సారి తన సత్తా ఏమిటో చూపించాడు చిరంజీవి. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన చిరు నటన లో ఏమాత్రం జోష్ తగ్గలేదని నిరూపించిందీ సినిమా. ఖైదీ కి ఘన విజయం కట్టబెట్టి మరోసారి ఆయనకు బ్రహ్మాండమైన వెల్ కమ్ ఇచ్చారు అభిమానులు. ఈ సినిమా మొదలవ్వకముందే 151 వ సినిమా గురించిన ఊహలు మొదలయ్యాయి.

ఈ చిత్రం ప్రమోషన్స్ సమయంలోనే తన ఫ్యూచర్ ప్లాన్స్ చూచాయగా వివరించాడుమెగాస్టార్. ఈ నేపథ్యంలో చిరు 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' బయోపిక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం అని కూడా చెప్తునారు. అయితే ఇప్పుడు మళ్ళీ చిరు ని హీరోయిన్ సమస్యే వెంటాడుతోంది. .

sruthi to replace anushka in chiru 151 movie Uyyaalawada Narasimhareddy

అసలు ఖైదీ నంబర్ 150 సినిమా అప్పుడు కూడా హీరోయిన్‌గా ఎవర్ని ఎంపిక చేయాలన్నదానిపై ఎక్కువ సమయం గడిపారు. చివరకు కాజల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. తాజాగా చిరంజీవి 151వ సినిమాకూ హీరోయిన్ ఎంపికే కష్టం అవుతోందట. ఇంకా సినిమానే ఖరారు కాలేదు కానీ.. హీరోయిన్ దాకా ఎందుకు అని ఆలోచిస్తున్నారా అంటే హీరోయిన్ల డేట్లు దొరకడం చిరంజీవి అంతటి మెగా స్టార్‌కి కూడా కష్టమైపోతోందని సమాచారం.

ఖైదీ వసూళ్లతో మెగా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్న తరుణంలో చెర్రీ తన సొంత బ్యానర్లో 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' అనే కథతో చిరంజీవి 151వ సినిమా రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అనుష్క ఉంటుందని వార్తలు వచ్చినా ఇప్పుడు మాత్రం సీన్ మారిందంటున్నారు. ఇంకా సినిమానే ఖరారు కాలేదు అప్పుడే.. హీరోయిన్ దాకా ఎందుకు? అని ఆలోచిస్తున్నారా...

కానీ, 151వ సినిమాకు తొలుత అనుష్కను సంప్రదించినా నో చెప్పిందని కథనాలు వెలువడ్డాయి. ఇప్పటివరకూ స్టాలిన్ చిత్రంలో చిరంజీవితో ఐటమ్ సాంగ్ తప్ప అనుష్క మెగా హీరోలతో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా జత కట్టలేదు. అయితే దీనికి సంబంధించి మరో వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. అనుష్కకు బదులు శ్రుతి హాసన్‌‌ను తీసుకునే ఆలోచన చేస్తున్నారని టాక్. అయితే.. మెగాస్టార్ పక్కన శ్రుతి హాసన్ నప్పుతుందా? అంటే.. నప్పేలా ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నారట.

గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అందుకున్న రేసుగుర్రం సినిమాలో నటించింది శ్రుతి. దీంతో తనకు లక్ ని అందించిన శ్రుతి పేరునే ఇప్పుడీ కొత్త సినిమాలో కూడా సూచిస్తున్నాడట సూరి. అయితే మెగాస్టార్ మాత్రం శ్రుతి తనకి జోడిగా సరిపోదేమో అన్న ఆలోచనతో అనుష్క వైపు మొగ్గు చూపిస్తున్నాడట. అనుష్క ఇప్పుడు బాగా లావుగా ఉందని, ఇంతకు ముందులా తన క్యూట్ లుక్స్ తో అభిమానులను ఆకట్టుకోలేదని సూరి.. చిరుని కన్వెన్స్ చేశాడని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి చిరు కన్వెన్స్ అయ్యాడో లేదో తెలియాలంటే కొన్ని వెయిట్ చెయ్యక తప్పదు. మరి, చిరంజీవితో చాన్స్ అంటే శ్రుతి హాసన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

English summary
Sruthi hasan to Replace Anushka in Megastar Chiru's 151 movie Uyyaalawada Narasimhareddy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu