»   » వాడి పోలికలతో పుడతారనేది రాజమౌళికి బాగా నచ్చింది

వాడి పోలికలతో పుడతారనేది రాజమౌళికి బాగా నచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: " పిల్లలు మాత్రం వాడి పోలికలతో పుడతారు " అంటూ ఆటోనగర్ సూర్య చిత్రంలో సమంత...అజయ్ తో చెప్పే డైలాగు బాగా పేలింది. ఇప్పుడు అదే డైలాగు తన పర్శనల్ ఫేవెరెట్ అంటున్నారు రాజమౌళి. రీసెంట్ గా ఆటోనగర్ సూర్య చిత్రం చూసిన రాజమౌళి ఆ ఎక్సపీరియన్స్ ని తన అభిమానులతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పంచుకున్నారు. అక్కడ రాస్తూ ఈ విషయాన్ని ప్రస్దావించారు.

రాజమౌళి ట్వీట్ చేస్తూ.... యూనియన్ వ్యతిరేకంగా పోరాడే ఓ ఒంటరి కథని తెరకు ఎక్కించిన దేవకట్టాగారి గట్స్ ని నేను అభినందిస్తున్నాను. అతని డైలాగులు పంచ్ తో బాగున్నాయి . " పిల్లలు మాత్రం వాడి పోలికలతో పుడతారు " మాత్రం నా పర్శనల్ ఫేవెరెట్. ట్రిమ్ చేయటం తప్పనిసరి..అది త్వరగా చేసారు అన్నారు.

SS Rajamouli about Auto Nagar Surya


ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ..ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. రానా ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. కొన్ని నెలలుగా అక్కడ యుద్ధం నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. 2000 మంది కళాకారులపై చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది.

ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది.

English summary
Rajamouli tweeted: "Appreciate Deva Katta garu for his guts for glorifying an Individual who fights against the union. His dialogues pack a punch. Samantha's "Pillalu Maathram vaadi polikatho pudathaaru" is my personal favourite. The trimming was essential and good the makers did it early on."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu