హాలీవుడ్‌లోకి రాజమౌళి ఎంట్రీ.. విజయేంద్ర ప్రసాద్ కథతో.. అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ మూవీ..
బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని ఆర్జించిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఏకంగా హాలీవుడ్‌లోనే సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించడానికి సిద్ధం కాబోతున్నారు. హాలీవుడ్ చిత్రం గురించి ఆయన తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. కమెడియన్ ఆలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..

రాజమౌళి కోసం హాలీవుడ్ స్థాయి కథ
హాలీవుడ్‌లో ఎంట్రీ విషయంపై విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. నా కుమారుడు రాజమౌళి కోసం ఓ కథ రాశాను. హాలీవుడ్‌లో నిర్మించబోతున్నాం. లైవ్ యానిమేషన్ చిత్రంగా తెరకెక్కించనున్నాం. చాలా పెద్ద ప్రాజెక్టుగా రూపొందించనున్నాం. హాలీవుడ్ స్టూడియో సహకారంతో నిర్మించబోతున్నాం అని తెలిపారు.

ఇండియన్ కంటెంట్.. ఇంటర్నేషనల్ స్థాయిలో
అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందే ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్స్, ఇండియన్ స్టార్స్ ఎవరూ ఉండరు. ఇండియన్ కంటెంట్‌తో హాలీవుడ్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఫ్లాట్‌ఫామ్‌లో నిర్మిస్తున్నాం. ఆ సినిమాతో రాజమౌళి పూర్తిస్థాయిలో హాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

నేను నాలుగు గోడలకే పరిమితం...
రాజమౌళి కోసం కథ రాయడం వరకే నా పని.. నన్ను హాలీవుడ్‌కు తీసుకెళ్లరు. ఇక్కడే వదిలేసి వెళ్తారు అంటూ సరదాగా ఆలీతో చమత్కరించారు. అంతకుముందు కథ రాయడానికి నన్ను ఎక్కడికి తీసుకెళ్లరు. నన్ను నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి కథ రాయిస్తారు అంటూ విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

మనం అమెరికాకు వెళ్దాం అంటూ..
విజయేంద్ర ప్రసాద్‌తో సరదాగా మాట్లాడుతూ.. వీసా అప్లై చేయండి.. పదేళ్లు వీసా వస్తుంది. అమెరికాకు వెళ్లి మనం అంతా చుట్టేసి వద్దాం. నేను మీతోపాటు కలిసి తిరుగుతాను అంటూ అలీ అన్నారు. దాంతో సరే అంటూ విజయేంద్ర ప్రసాద్ ఆ టాపిక్‌ను ముగించారు. హాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందంటూ ఆలీ వ్యాఖ్యానించారు.
Recommended Video

జక్కన్న, విజయేంద్ర ప్రసాద్ కాంబినేషన్‌లో RRR
ప్రస్తుతం రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ కాంబినేషన్‌లో RRR చిత్రం రానున్నది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ కీలక, దేశభక్తితో కూడిన పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, ఆలియాభట్, తమిళ నటుడు సముద్రఖని తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











