»   » 'ఆటో నగర్ సూర్య' టీజర్ టెర్రిఫిక్...రాజమౌళి

'ఆటో నగర్ సూర్య' టీజర్ టెర్రిఫిక్...రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్దానం దర్శకుడు దేవకట్టా తాను రూపొందించబోయే చిత్రం ఆటో నగర్ సూర్య కి ఆడియో టీజర్ వదిలిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ విన్న రాజమౌళి ట్విట్టర్ లో అబినందిస్తూ ఇలా ట్వీట్ చేసారు...ఇప్పుడే దేవకట్టా..ఆటో నగర్ సూర్య ఆడియో టీజర్ విన్నాను...టెర్రిఫిక్ గా ఉంది. సినిమా ఎప్పుడు చూస్తామా అన్నట్లుంది అన్నారు. ఇక ఈ ఆటో నగర్ సూర్య సబ్జెక్టుని రీసెంట్ గా నిర్మాతలు శివలెంక కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్ లు విన్నారని సమాచారం.

విజయవాడ రౌడీ పాలిటిక్స్ చుట్టూ అల్లుకున్న ఈ కథనం వారికి బాగా నచ్చిందని చెప్తున్నారు.అయితే ఎవరూ ఇంకా కన్ఫర్మ్ కాలేదని, హీరో ఓకే అయ్యాక మిగతా పనులు చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఇక ఈ సబ్జెక్టుకి మొదట రానాని దేవకట్టా సంప్రదించాడని, వారు ఎంతకాలమున్నా తేల్చకపోయే సరికి మరో నిర్మాతతో కమిటయ్యే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇదిలా ఉంటే మరోప్రక్క వర్మ కూడా బెజవాడ రౌడీలు టైటిల్ తో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు.

ఈ టీజర్ ని ఈ లింక్ లో వినచ్చు...
http://www.youtube.com/watch?v=SyTfhPh6EBs&feature=related

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu