twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భేష్ రాజమౌళి.. జక్కన్నపై సజ్జనార్ ప్రశంసల వర్షం,, మాట తప్పలేదంటూ

    |

    బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించిన దర్శకుడు రాజమౌళి కరోనావైరస్ పడ్డారనే వార్తతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయన వ్యాధి నుంచి బయటపడాలని ఫ్యాన్స్, స్నేహితులు, సన్నిహితులు ప్రార్థించారు. రెండు వారాల తర్వాత ఆయన కరోనా నుంచి సంపూర్ణంగా బయటపడ్డారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. అయితే కరోనా సమయంలో ఇచ్చిన మాటను రాజమౌళి నిలబెట్టుకోవడంపై ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జక్కన నిలబెట్టుకొన్న మాట ఏమిటంటే..

    Recommended Video

    #Magadheera : SS Rajamouli మ్యాజిక్, మగధీర Facts, బాహుబలి వచ్చిందంటే మగధీర వల్లే || Oneindia Telugu
    కరోనా పేషెంట్లకు ప్లాస్మా

    కరోనా పేషెంట్లకు ప్లాస్మా

    కరోనా పేషెంట్లకు ప్లాస్మా అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ప్లాస్మా ఎక్కడ లభ్యమవుతుంది. ప్లాస్మా కోసం ఎవరిని సంప్రదించాలనే పరిస్థితుల్లో సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కంట్రోల్ (SCSC), సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా donateplasma.scsc.in అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్లాస్మా అవసరమైన వాళ్లు, ప్లాస్మాదాతలు కూడా తమ పేర్లను నమోదు చేసుకొనే విధంగా వెసలుబాటును కల్పించారు. ఈ నేపథ్యంలో రాజమౌళి దంపతులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్‌ను సందర్శించారు.

    కరోనావైరస్ తగ్గిన తర్వాత దానం చేస్తా

    కరోనావైరస్ తగ్గిన తర్వాత దానం చేస్తా

    రాజమౌళి కరోనా సోకిన వెంటనే.. నాకు ఆయన కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే ఈ వ్యాధి నుంచి బయటపడి ప్లాస్మా డొనేట్ చేస్తాను అని హామీ ఇచ్చారు. తాను ఇచ్చిన హామీకి కట్టుబడి.. కరోనావైరస్‌ను జయించిన రాజమౌళి దంపతులు బుధవారం సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ప్లాస్మా డొనేట్ చేశారు.

    రాజమౌళి దంపతులను సత్కరించిన సజ్జనార్

    రాజమౌళి దంపతులను సత్కరించిన సజ్జనార్

    సైబారాబాద్ పోలీసులు అధికారులు నిర్వహించిన క్యాంపులో రాజమౌళి దంపతులతోపాటు ఎంఎం కీరవాణి దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్మా దాతలను సైబరాబాద్ పోలీసులు సత్కరించారు. ఇతర దాతలతోపాటు రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా ఈ సత్కారాన్ని పొందారు. ఈ సత్కారానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

     రాజమౌళి ఫ్యామిలీపై ప్రశంసల వర్షం

    రాజమౌళి ఫ్యామిలీపై ప్రశంసల వర్షం

    ఎస్ఎస్ రాజమౌళి దంపతులను కమిషనర్ సజ్జనార్ సత్కరించారు. శాలువా కప్పి చిత్ర పటాన్ని బహుకరించారు. ఈ సందర్బంగా రాజమౌళిని, రమారాజమౌళిని పోలీసు అధికారులు అభినందించారు. ప్లాస్మాదానం చేయడం వల్ల మరో ఇద్దరి ప్రాణాలను కాపాడిన వారయ్యారంటూ కితాబు ఇచ్చారు. సెలబ్రిటీ వల్ల ఈ గొప్ప కార్యక్రమంపై ప్రజల అవగాహన కలుగుతుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. గతంలో విజయ్ దేవరకొండ, చిరంజీవి, నాగార్జున లాంటి ప్రముఖులు ఇలాంటి కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు.

    తొలి సెలబ్రిటీలుగా రాజమౌళి దంపతుల రికార్డు

    తొలి సెలబ్రిటీలుగా రాజమౌళి దంపతుల రికార్డు

    సైబరాబాద్ పోలీసుల నిర్వహిస్తున్న క్యాంపులో ప్లాస్మా దానం చేయడం ద్వారా రాజమౌళి కుటుంబ ఓ అరుదైన గుర్తింపును పొందారు. ఇలాంటి కార్యక్రమాలంలో దాతలుగా మారిన తొలి సెలబ్రిటీలుగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నారు. గతంలో విజయ్ దేవరకొండ పోలీసులు నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఏదో ఒకరు కరోనా బారిన పడుతాను. అప్పుడు నేను కూడా ప్లాస్మా దానం చేస్తానని అన్నారు. ా

    RRR మూవీతో ప్రేక్షకుల ముందుకు

    RRR మూవీతో ప్రేక్షకుల ముందుకు

    బాహుబలి మూవీ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం RRR. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కరోనా పరిస్థితులు విజృంభణ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా షూటింగును ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

    English summary
    Popular Director SS Rajamouli participated in Cyberabad commissioner of Police Sajjanar's SCSC Plasam donation program. He donates palsma after he tested coronavirus positive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X