»   » రాజమౌళి ట్వీట్ కు కాలిందా? వెంటనే కౌంటర్

రాజమౌళి ట్వీట్ కు కాలిందా? వెంటనే కౌంటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'సినిమా తీయాలనుకునే ఉత్సాహవంతులందరూ యూట్యూట్‌లో రామ్‌గోపాల్‌ వర్మ క్లాస్‌లు చెప్పిన వీడియోలు చూడాలి. అయితే కంటెంట్‌ విషయంలో ఐస్‌క్రీమ్‌ను ఉదాహరణగా తీసుకోవద్దు. దాన్ని వర్క్‌మోడల్‌గానే చూడాలి' అని రాజమౌళి ట్వీట్‌ చేశారు. అయితే ఐస్ క్రీమ్ ని ఉదాహరణగా కంటెంట్ విషయంలో తీసుకోవద్దు అని రాజమౌళి చెప్పిన మాటలు వర్మని కాలేలా చేసాయి. దాంతో ఆయన వెంటనే... రాజమౌళి చేసే సినిమలాకు ఈ నో బడ్జెట్ మేకింగ్ అనేది ప్రమాదమని భావిస్తున్నారంటూ ఎదురు దాడికి దిగారు. వారి మధ్య ఇలా సంభాషణ ఆసక్తికరంగా సాగింది.

రాజమౌళి తన ట్వీట్ లో ...రాత్రి వరుసగా మూడుసార్లు ఆ వీడియో చూశాను. సినిమా తీయాలనుకునేవాళ్లంతా జాగ్రత్తగా చూడాల్సిన వీడియో ఇది. ఈ కాన్సెప్టు ప్యారలల్‌ సినిమా ఇండసీ్ట్రకి పునాది లాంటిదే కాదు... రానున్న కొద్ది సంవత్సరాల్లో సంప్రదాయ సినిమాని సవాలు చేయగలది కూడా. సినిమా తీయడానికి డబ్బులు, హంగామా అవసరం లేదు. స్టోరీ అండ్‌ డిటర్మినేషన్‌ ముఖ్యం. ఐస్‌క్రీమ్‌ సినిమాను కంటెంట్‌కు ఉదాహరణగా తీసుకోవద్దు. దాన్ని పని విషయంలోనే స్ఫూర్తిగా తీసుకోవాలి' అన్నారు.

SS Rajamouli backs Ram Gopal Varma!

దానికి వర్మ వెంటనే... హై బడ్జెట్‌ సినిమాలు తీసే రాజమౌళికి నో బడ్జెట్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ను అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. నో బడ్జెట్‌ సినిమాలు సంప్రదాయ సినిమాకు ప్రమాదమనే విషయం రాజమౌళి మాటల్లో కనిపిస్తోంది. 'ఐస్‌క్రీమ్‌' సినిమా నుంచి స్ఫూర్తిపొందిన కొత్త పరిశ్రమ గెరిల్లా గ్రూపుల్లా దాడిచేస్తూ సంప్రదాయ సినిమా పరిశ్రమను మింగేస్తుంది' అన్నారు.

అప్పుడు రాజమౌళి అక్కడితో ఆ టాపిక్ కి ఫుల్ స్టాఫ్ పెడుతూ... సర్‌, రెండు పరిశ్రమలూ ఒకదానితో ఒకటి పోటీపడుతూ మనుగడ సాగించాలి. నో బడ్జెట్‌ పరిశ్రమ కంటెంట్‌ పరంగా నడిస్తే, సంప్రదాయక సినిమా పరిశ్రమకు గ్లామర్‌ ఊపిరిలాంటిది. మన మనుగడకు ఈ రెండూ కావాల్సిందే అన్నారు.

English summary
SS Rajamouli is in accord with his counterpart Ram Gopal Varma’s (RGV) philosophy that money and establishment are not required to make a film and that story and determination matter the most.Following the criticism he received for his latest Telugu release Ice Cream, RGV recently spoke at length about the business model he follows for his films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu