»   » బాహుబలి తర్వాత మహాభారతం తీయను.. పదేళ్ల తర్వాతే.. రాజమౌళి

బాహుబలి తర్వాత మహాభారతం తీయను.. పదేళ్ల తర్వాతే.. రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోయే చిత్రం గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చజరుగుతున్నది. మీడియాలో అనేక రూమర్లు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. అలాంటి రూమర్లకు ఇటీవల టీఎఫ్సీ.ఇన్ కోసం సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెరదించారు.

పదేళ్ల తర్వాతే మహాభారతం

పదేళ్ల తర్వాతే మహాభారతం

బాహుబలి తర్వాత మహాభారతం ఉండదు. మరో పదేళ్ల తర్వాత తీస్తాను. అది కూడా కన్ఫర్మ్ కాదు. పదేండ్లలో ఎలాంటి సాంకేతిక మార్పులు ఏమి చోటుచేసుకుంటాయో తెలియవు. మహాభారతం తీయాలంటే చాలా అనుభవం ఉండాలి.


బాహుబలి1 స్టార్టర్. బాహుబలి2 మంచి భోజనం

బాహుబలి1 స్టార్టర్. బాహుబలి2 మంచి భోజనం

మంచి విందు తినేటప్పుడు బాహుబలి1 స్టార్టర్స్ లాంటింది. బాహుబలి2 భోజనం లాంటింది. మొదటి భాగంలో కేవలం పాత్రల పరిచయం జరిగింది. రెండో భాగంలో ఆ పాత్రల ఎమోషన్స్ ఉంటాయి.


బాహుబలి2 ట్రైలర్ రిలీజ్‌కు సమస్యలు

బాహుబలి2 ట్రైలర్ రిలీజ్‌కు సమస్యలు

బాహుబలి2 ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ చేయడానికి సాంకేతిక ఇబ్బందులున్నాయి. మార్చి రెండో వారంలో విడుదల చేయనున్నాం. గ్రాఫిక్ వర్క్ జరుగుతున్నది. ముందే డేట్ అనౌన్స్ చేస్తే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


బాహుబలి2తో కథ ముగుస్తుంది..

బాహుబలి2తో కథ ముగుస్తుంది..

బాహుబలి కథ 'కన్‌క్లూజన్‌'తో ముగిసిపోతుంది. కానీ పాత్రలు ఇంకా కొనసాగుతాయి. పాత్రలు వివిధ రూపాల్లో అంటే టీవీ సిరీస్, వీడియో సిరీస్, కామిక్స్, నవలల రూపంలో ప్రేక్షకులను చేరుతాయి. బాహుబలి కథ వెండితెరపై సాగదీయడం జరుగదు.


బాహుబలి అంటే ప్రస్తుతం ప్రభాసే..

బాహుబలి అంటే ప్రస్తుతం ప్రభాసే..

బాహుబలి తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు బాహుబలి అంటే ప్రభాసే అంటారు. గోమటేశ్వరుడు అని అనరు. పాత్రను, కథలో లీనమై నటించడం అందుకు కారణం. బాహుబలిలో కట్టమ్మ, శివగామి పాత్రల చిత్రీకరణ బాగుంటుంది.


డైలాగ్ చెప్పకూడదు.. రమ్యకృష్ణ విశ్వరూపమే..

డైలాగ్ చెప్పకూడదు.. రమ్యకృష్ణ విశ్వరూపమే..

రమ్యకృష్ణ, నాజర్, ప్రభాస్ పనితీరు డిఫరెంట్. రమ్యకృష్ణకు కథ చెప్పకూడదు. సెట్‌లోకి వచ్చిన తర్వాత డైలాగ్ చెబితే చాలు విశ్వరూపం చూపిస్తుంది. నాజర్‌కు ముందు సీన్ చెప్పాలి. ఇంకొందరికి సీన్ చేసి చూపెట్టాలి.


English summary
SS Rajamouli reveals the next plans after Bahubali2. He said no Mahabharat immediate after Bahubali2. Mahabhart only realty after 10 years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu