»   » మహాభారతంపై అమీర్‌తో చర్చించిన రాజమౌళి.. దానిని తీయడం భారతీయులకు కష్టం

మహాభారతంపై అమీర్‌తో చర్చించిన రాజమౌళి.. దానిని తీయడం భారతీయులకు కష్టం

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకొన్న రాజమౌళి తదుపరి చిత్రంగా మహాభారతాన్ని తెరకెక్కించనున్నారనే వార్తలు అప్పట్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. అయితే బాహుబలి తర్వాత వెంటనే మహాభారతాన్ని తెరకెక్కించను అని రాజమౌళి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ మహాభారతంపై రాజమౌళి సినిమా తీస్తే తాను నటించడానికి సిద్ధమని, ఆ చిత్రంలో కృష్ణుడి పాత్రను పోషించాలని ఉందని ఇటీవల అమీర్‌ఖాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌ను కలిసి చర్చించానని రాజమౌళి ఇటీవల వెల్లడించారు.

అమీర్‌కు సాధ్యం కాదు..

అమీర్‌కు సాధ్యం కాదు..

అవును. ఇటీవల అమీర్‌ఖాన్ కలిశాను. మహాభారత్ గురించి చర్చించాను. మహాభారతంలో నటించడానికి అమీర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అయితే బాహుబలి తర్వాత వెంటనే ఆ సినిమా చేసే ఉద్దేశం లేదు. మహాభారతం లాంటి కథను సినిమాగా తీయాలంటే మానసికంగా సిద్ధం కావాలి. కానీ పురాణాన్ని మాత్రం చిత్రంగా మలచడం గ్యారెంటీ అని రాజమౌళి అన్నాడు. గతంలో మహాభారతాన్ని సినిమా మలిచే ఉద్దేశంతో అమీర్, బిగ్ బీ అమితాబ్‌ను కలిసినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

నేను కూడా తీస్తా.. షారుక్

నేను కూడా తీస్తా.. షారుక్

ఇదిలా ఉండగా, మహాభారతంపై ఇటీవల మరో ఆసక్తికరమైన వార్త వెలుగులొకి వచ్చింది. బాలీవుడ్ బాద్షా కూడా మహాభారతంపై మనసు పారేసుకొన్నాడట. మహాభారతాన్ని వెండితెరకు ఎక్కించాలన్నది నా చిరకాల స్వప్నం. అయితే నా వద్ద అంత బడ్జెట్ లేదు. ఎట్లాగైనా ఆ ప్రాజెక్ట్ చేయాలని ఉంది. అంత స్థోమత నాకు లేదు అని షారుక్ అన్నారు.

ఫారిన్ ప్రొడ్యూసర్‌తో..

ఫారిన్ ప్రొడ్యూసర్‌తో..

ఒకవేళ మహాభారతాన్ని తెరకెక్కించాలనుకుంటే విదేశీ సంస్థతో కలిసి నిర్మిస్తాను. దేశీయ నిర్మాతలతో ప్రాజెక్ట్ చేపట్టను. ఇండియన్ మార్కెట్‌కు, ఇండియన్ సినిమాలకు, నిర్మాతలకు పరిమితి ఉంటుంది. అందుకే ఈ చిత్రానికి విదేశీ నిర్మాతలు ఉండాల్సిందే. అందువల్ల విదేశీ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. బాహుబలిని మించిన విధంగా మహాభారతాన్ని తెరకెక్కించాలి అని షారుక్ పేర్కొన్నాడు.

28న బాహుబలి విడుదల

28న బాహుబలి విడుదల

ప్రస్తుతం బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్ర ప్రమోషన్‌పైనే రాజమౌళి దృష్టిపెట్టాడు. ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతున్నది. దీంతో గత రెండేళ్లుగా ప్రేక్షకులను వెంటాడుతున్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం దొరుకనున్నది.

English summary
Director Rajmouli Confirms Meeting Aamir Khan "Yeah I met Aamir ji once quite sometime back, We spoke about Mahabharata. I know that he's very much interested in doing the film." "I want to do Mahabharata and I have said that many times but definitely not immediately after Baahubali. Mahabharata is such an epic that I need to up my craftsmanship to handle such a subject."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu