»   » బాహుబలి కి నాలుగు క్లైమాక్స్ లా!? రివీల్ చేయకుండా ఉండాల్సింది....

బాహుబలి కి నాలుగు క్లైమాక్స్ లా!? రివీల్ చేయకుండా ఉండాల్సింది....

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి తెలుగు సినిమానే కాద్ మొత్తంగా భారతీయ సినిమా రంగాన్నే ఒక మలుపు తిప్పిన చిత్రం. రాజమౌళి అనే ఒక సాధారణ దర్శకుడు చూస్తూండగానే అసలు తానే ఒక సినిమా ఇండస్ట్రీ అన్నంత రేంజ్ లో ఎదిగాడు. బాహుబలి అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ వసూళ్ళనే సాధించింది. అయితే రెండుపార్టులుగా తీస్తున్న ఈసినిమా మొదటి భాగం ఇంత ఘణవిజయాన్ని సాధించటం తో సహజంగానే రెండో సినిమా మీద ఒత్తిడి పెరిగింది. ఏ చిన్న విషయం లోనూ రిస్క్ తీసుకోవటం లేదు రాజమౌళి...

అదే పద్దతిలో భాగంగా కథలో నూ చాలానే మార్పులు చేసాడు. ఈ కొత్త మార్పుల ప్రకారం బాహుబలి 2 కి నాలుగు క్లైమాక్స్ లు అనుకున్నారట.. అనుకోవటం అంటే రాసి పెట్టుకోవటం కాదు ఏకంగా నాలుగూ షూట్ కూడా చేసేసారట. వీటి లో ఏది బావుందనిపిస్తే అది వాడుకుంటారట. అయితే ఇప్పుడు ఈ న్యూసే కాస్త గనర గోళానికి దారి తీసింది. ప్రేక్షకుల్లో అనవసరమైన ఉత్సుకథ ని కలిగించింది.


SS Rajamouli filmed four versions of climax for Bahubali 2

ఏదో ఒకటి రెండు అంటే చెప్పలేం కాని ఏకంగా నాలుగు క్లైమాక్స్ అంటే ఒకవేళ ఉంచిన క్లైమాక్స్ కాకుండా ఇంకా మిగతా మూడు ఏవై ఉంటాయా అన్న రేంజ్ లో ఆడియెన్స్ ఆలోచింది పెట్టిన క్లైమాక్స్ కు సాటిస్ఫై అవ్వకపోవచ్చు. ఇప్పుడున్న దానికన్ టే వేరే క్లైమాక్స్ ఉంటే బావుండేదేమో అసలు ఆ క్లైమాక్స్ ఏమిటీ అన్న ఆలోచన ఖచ్చితంగా సినిమా మీద ప్రభావం చూపిస్తుంది.


ప్రస్తుతం ఆ ముగింపు షూటింగ్ లోనే నిమగ్నమై ఉన్న చిత్రయూనిట్ వాటిని త్వరలోనే పూర్తి చేసుకుని మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకోనుంది. ఇప్పటికే అసలు అట్రాక్షన్ అయిన అనుష్క దేవసేన సీన్స్ తగ్గించి అవంతిక తమన్నా సీన్స్ పెంచేస్తున్నారన్న న్యూసే అనుష్క అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇదే ఒక దెబ్బ అనుకుంటే ఇప్పుడేమో ఈ న్యూస్ తో మరింత అయోమయం లో పడేస్తున్నారు.


సినిమా అంతా హంగామా చేసి చివరకు ఏదన్నా తేడా జరిగితే మొదటి భాగానికి వచ్చిన గొప్ప పేరు మొత్తం ఈ సెకండ్ పార్ట్ తో పోతుంది.అంతే కాదు రెండోపార్ట్ ఏమాత్రం దెబ్బతిన్నా ఇక మళ్ళీ వచ్చే రాజమౌళి ప్రాజెక్ట్ లమీద కూదా ఓవర్సీస్ లోనూ... ఇతర భాషల్లోనూ ప్రభావం కనిపించే అవకాశం ఉంది....


అయితే ఇక్కడొక మార్గం చెబుతున్నారట... సినిమా వచ్చిన కొన్నాళ్ళకి మళ్ళీ ఈ మూడు క్లైమాక్స్లని కూడా విడి విడిగా నెట్లో రిలీజ్ చేస్తారట. ఆ రకంగా కొంత ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు.. ఈ ఆలోచన ఏదో బాగానే ఉంది. ఎంతైనా రాజమౌళి ఆలోచనలూ... మామూలు కన్నా ఒకటీ రెండు మెట్లు కాస్త పైనే ఉంటాయి మరి.

English summary
The climax is the most important portion of "Baahubali: The Conclusion SS Rajamouli filmed four versions of climax for Bahubali
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu