»   » బాహుబలి2: ప్రభాస్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా! రానా కాదు..

బాహుబలి2: ప్రభాస్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా! రానా కాదు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. భారతీయ సినిమా కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తూ ఈ చిత్రం తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇండియన్ సినిమాకు సంబంధించిన దాదాపు 30 రికార్డులను బ్రేక్ చేసింది. చరిత్రాత్మక విజయాన్ని అందుకొన్న ఈ చిత్రానికి పనిచేసిన వారు భారీగా రెమ్యునరేషన్ అందుకొన్నారు. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో బాహుబలి తారలు, సాంకేతిక వర్గాల రెమ్యునరేషన్ చర్చనీయాంశమైంది. బాహుబలిగా నటించిన ప్రభాస్ కంటే అధికంగా పారితోషికం అందుకొన్న వారు ఎవరంటే..

రానాకు రూ.15 కోట్లు.. ప్రభాస్ 25 కోట్లు

రానాకు రూ.15 కోట్లు.. ప్రభాస్ 25 కోట్లు

బాహుబలి సినిమాలో నటించినందుకు గాను రానా దగ్గుబాటి రూ.15 కోట్లు, తమన్నా భాటియా, అనుష్క చెరో రూ.5 కోట్లు, రమ్యకృష్ణ రూ.2.5 కోట్ల పారితోషికాన్ని అందుకొన్నారు. ప్రభాస్‌కు రూ.25 కోట్ల రెమ్యునరేషన్ లభించింది. బాహుబలికి సంబంధించినంత వరకు తారలు అందుకొన్న అధిక రెమ్యునరేషన్లు.


భారీగా రాజమౌళికి..

భారీగా రాజమౌళికి..

కానీ బాహుబలికి మూలపురుషుడు, విలక్షణమైన విజన్‌తో హిస్టారికల్ మూవీని అందించిన రాజమౌళి రెమ్యునరేషన్ మాత్రం తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. ఈ సినిమా కోసం లాభాల్లో వాటాతోపాటు రూ.28 కోట్ల రూపాయల పారితోషికాన్ని రాజమౌళి అందుకొన్నట్టు సమాచారం. రెమ్యునరేషన్ విషయం పక్కన పడితే ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమా ప్రముఖుడికి రాని క్రెడిట్ ఒక్క బాహుబలితోనే రాజమౌళి సంపాదించుకోవడం గమనార్హం.


 1500 కోట్ల వైపు..

1500 కోట్ల వైపు..

ఐదేళ్ల బాహుబలి నిర్మాణం తర్వాత ప్రస్తుతం రాజమౌళి కుటుంబంతోపాటు విహార యాత్రకు వెళ్లినట్టు సమాచారం. బాహుబలి చిత్రం సృష్టిస్తున్న హంగామాను చూసి ప్రస్తుతం రాజమౌళి ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి చిత్రం రూ.1200 కోట్ల వసూలు చేసింది. రూ.1500 కోట్ల మైలురాయిని అధిగమించేందుకు సిద్దమవుతున్నది.


వెకేషన్‌లో ప్రభాస్..

వెకేషన్‌లో ప్రభాస్..

బాహుబలిగా దేశవ్యాప్త ఆదరణను చూరగొన్న ప్రభాస్ అమెరికాలో వెకెషన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. విహారయాత్ర తర్వాత అమెరికాలో ప్రారంభమయ్యే సాహో చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్‌ను కూడగట్టుకొంటున్నది. సాహో చిత్రానికి సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.English summary
Prabhas got a sum of Rs 25 crore for Baahubali. Rajamouli got the largest amount of pay cheque. The Baahubali helmer took home Rs 28 crore and apart from that amount, he is also said to get a share in the profits of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu