నా ఓటు దానికే.. ఎవరికి వేయాలో చెప్పిన రాజమౌళి.. ఆ విషయం మరువొద్దని హెచ్చరిక
తెలంగాణ ఎన్నికల ఫీవర్ టాలీవుడ్ సినీ ప్రముఖులకు తాకుతున్నది. రాష్ట్రంలో ఎన్నికల పరిస్థితి నువ్వా నేనా అనే విధంగా ఉండటంతో ప్రతీ సాధారణ పౌరులతోపాటు సినీ ప్రముఖుల దృష్టంతా డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికలపై పడింది. ప్రతీ ఒక్కరు తమ ఓటును వేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు. జక్కన ఏమన్నారంటే..

RRR మూవీ గురించి
ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న RRR సినిమా గురించి సమాచారం అందిస్తూ రాజమౌళి ట్వీట్ చేశారు. తొలి షెడ్యూల్ పూర్తయింది అని పేర్కొన్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌కు జక్కన తెర తీసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొని
RRR మూవీ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఓటు వేయడానికి రెడీగా ఉన్నాను. ఓటు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. మీరందరూ ఓటు వేయడానికి సిద్దంగా ఉన్నారా? అంటూ రాజమౌళి ఉత్సాహపరిచారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజల్లారా
అంతేకాకుండా ఓటు ప్రాముఖ్యతను రాజమౌళి కూడా చెప్పకనే చెప్పారు. ప్రియమైన తెలంగాణ ప్రజల్లారా. మన భవిష్యత్‌ను మార్చబోయే ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. ఓటు వేయడం మరిచిపోకండి అంటూ రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు.

గతంలో లోక్‌సత్తా పార్టీతో
బాహుబలి మూవీతో ప్రపంచ ఖ్యాతిని సొంత చేసుకొన్న ఎస్ఎస్ రాజమౌళికి రాజకీయాలతో చిన్న పరిచయం ఉంది. గతంలో లోక్‌సత్తా పార్టీకి మద్దతును ఇచ్చి తన వంతు సాయం చేశారు. సామాజిక బాధ్యతను అప్పుడప్పుడూ గుర్తు చేయడం రాజమౌళికి అలవాటే అనే విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











