»   » మహేశ్‌బాబు.. కాదు ముందు.. యంగ్‌టైగర్.. ఏమో అల్లు అర్జున్.. రాజమౌళి తికమక

మహేశ్‌బాబు.. కాదు ముందు.. యంగ్‌టైగర్.. ఏమో అల్లు అర్జున్.. రాజమౌళి తికమక

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 తర్వాత దర్శకుడు రాజమౌళి రూపొందించబోయే సినిమా ఏంటనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. తన తదుపరి చిత్రంపై ఇప్పటివరకు దర్శకుడు రాజమౌళి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ రెండు చిత్రం మాత్రం మహేశ్‌బాబు అనే మాటను మాత్రం వెల్లడించడంతో ప్రిన్స్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. దానికంటే ముందు తీసే సినిమా ఎన్టీఆర్‌తో ఉంటుందనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

తదుపరి సినిమాలపై జక్కన్న క్లారిటీ

తదుపరి సినిమాలపై జక్కన్న క్లారిటీ

బాహుబలిలో భళ్లాలదేవ పాత్రతో ఆకట్టుకొన్న రానా దగ్గుబాటి హోస్ట్‌గా నంబర్ వన్ యారీ అనే షో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాజమౌళి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తన తదుపరి ప్రాజెక్టుల గురించి కొంత వివరణ ఇచ్చారు. నిర్మాతలు కేఎల్ నారాయణ, డీవీవీ దానయ్యతో సినిమాలు చేయాల్సి ఉంది అని జక్కన్న చెప్పారు.

ప్రిన్స్ మహేశ్‌తో కేఎల్ నారాయణ సినిమా

ప్రిన్స్ మహేశ్‌తో కేఎల్ నారాయణ సినిమా

సూపర్‌స్టార్ మహేశ్‌తో ఓ సినిమా చేస్తాను. ఆ చిత్రానికి కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇంకా ఆ ప్రాజెక్ట్కు ఇంకా టైం పడుతుంది. కథ గురించి అనుకొన్నాం. ఇంకా దానిపై పూర్తిస్థాయిలో ఆలోచించలేదు. ఆ లైన్‌పై కసరత్తు చేయాల్సి ఉంది అని రాజమౌళి చెప్పారు.

కథను బట్టి హీరో అంటున్న రాజమౌళి

కథను బట్టి హీరో అంటున్న రాజమౌళి

ప్రిన్స్‌ మహేశ్‌బాబుతో సినిమా చేసే ముందు డీవీవీ దానయ్యతో సినిమా చేస్తాను. నిర్మాత దానయ్య చిత్రం కోసం ప్రస్తుతం కథను సిద్ధం చేస్తున్నాను. ఇక ఆ కథకు ఏ హీరో సరిపోతాడో.. అతనినే ఆ ప్రాజెక్ట్‌లో తీసుకోవాలనుకుంటున్నాను అని రాజమౌళి చూచాయగా చెప్పారు.

ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్

ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్

అయితే.. రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్నారనే వార్త ఫిలింనగర్‌లో ప్రచారంలో ఉంది. అలాగే మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ పేరు ఈ సినిమా కోసం వినిపడుతున్నది. ఏది ఏమైనా కథ తయారైన తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాజమౌళి హీరోపై ఓ నిర్ణయం తీసుకొంటారని తెలుస్తున్నది.

English summary
Baahubali director Rajamouli given clarity about his next projects. He said his next movies will be with DVV Danayya and KL Narayana. Reports suggest that his heroes for the movies are NTR and Prince Maheshbabu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu