»   » రజనీతో రాజమౌళి సినిమా తీస్తే.. ఆ చిత్ర రికార్డులు బద్దలు.. ఓ డైరెక్టర్ జోస్యం..

రజనీతో రాజమౌళి సినిమా తీస్తే.. ఆ చిత్ర రికార్డులు బద్దలు.. ఓ డైరెక్టర్ జోస్యం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా రూపొందించిన బాహుబలి ప్రభంజనం ఒకవైపు కొనసాగుతుండగానే, మరోవైపు రాజమౌళి తీయబోయే సినిమా ఏంటనే విషయంపై చర్చ జోరుగా సాగుతున్నది. ఈ చర్చ టాలీవుడ్, కోలీవుడ్‌లో జరిగే పెద్దగా పట్టించుకోవాల్సిందే కాదు. కానీ రజనీ, రాజమౌళి సినిమా అంశంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్నది. బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో బాహుబలి2 స్పెషల్ స్క్రీనింగ్ సందర్భాన్ని పురస్కరించుకొని లండన్‌కు వెళ్లిన రాజమౌళితో బీబీసీ మీడియా ప్రత్యేకంగా మాట్లాడింది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా ఎప్పుడు చేస్తున్నారని అడిగిన మిలియన్ డాలర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇచ్చింది ఇదే..

కల సాకారమే...

కల సాకారమే...

సినీ పరిశ్రమలో రజనీకాంత్ మంచి మానవత్వంతో కూడిన ఉన్నతమైన వ్యక్తి. ఇండియాలో ఆయన దిగ్గజ స్టార్. తెరమీద ఆయనను చూడటానికి ప్రేక్షకులు పడిచస్తారు. అంతటి క్రేజ్ ఉన్న రజనీకాంత్‌తో సినిమా తీయడం అనేది ఏ దర్శకుడికైనా సుదీర్ఘ కల సాకారం అవుతుందని చెప్పవచ్చు. అందుకు నేనేమీ మినహాయింపు కాదు అని రాజమౌళి అన్నారు.

అద్భుతమైన కథ ఉండాలి..

అద్భుతమైన కథ ఉండాలి..

రజనీతో సినిమా తీయాలంటే అద్భుతమైన కథ ఉండాలి. కథతోనే ప్రేక్షకుడిని కట్టిపడేయవచ్చు అనే విషయాన్ని నేను నమ్ముతాను. రజనీకాంత్‌ స్థాయికి తగినట్టు ఏదైనా కథ ప్రేరణ కలిగితే తప్పకుండా సినిమా తీస్తాను. రజనీతో సినిమా చేయడమంటే నాకు చెప్పలేనంత ఇష్టం అని జక్కన్న అన్నారు.

రజనీతో సినిమా తీస్తే..

రజనీతో సినిమా తీస్తే..

బాహుబలి2 ప్రమోషన్ సందర్భంగా ఇటీవల విద్యార్థులతో రాజమౌళి మాట్లాడుతూ.. రజనీకాంత్‌తో సినిమా తీస్తే పది రోజులపాటు డైలాగ్స్ వినిపించకుండా అరుపులు, ఈలలతో థియేటర్లను దద్దరిల్లిపోవాలి అని రాజమౌళి అన్నారు. బాహుబలి తర్వాత గరుడ అనే సినిమా మదిలో మెదలుతున్నదని రాజమౌళి హింటి ఇచ్చారు. ఒకవేళ గురుడ సినిమా ఒకే అయితే రజనీతో సినిమా తీసే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నాయి సినీ వర్గాలు.

అవతార్ రికార్డులు బ్రేక్..

రజనీకాంత్, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా గురించి మీడియాలో ఇటీవల వార్తలు ఎక్కువే అయ్యాయి. రజనీ, జక్కన్న సినిమా గురించి ప్రేమమ్ దర్శకుడు అల్ఫోన్సే పుత్రిన్ ఈ కింది విధంగా స్పందించాడు. ఒకవేళ రజనీ, రాజమౌళి సినిమా వస్తే ప్రపంచవ్యాప్తంగా అవతార్ బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కావడం ఖాయం అని అల్ఫోన్సే పుతిన్ అన్నారు.

English summary
Baahubali 2: The Conclusion, filmmaker SS Rajamouli said it would be a dream come true to work with Rajinikanth. In an interview to BBC correspondent, the Baahubali director said, "Rajinikanth is humility personified. He's a huge star in India and people are dying to just see him on the screen. To make a film with Rajinikanth will be a dream come true for any director and I'm not an exception.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu