చెక్ మాస్, క్లాస్ హద్దులను చెరిపేస్తుంది.. థియేటర్‌కు వెళ్లి ఎప్పుడెప్పుడూ చూడాలని ఉంది: ఎస్ఎస్ రాజమౌళి
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వీ ఆనంద ప్రసాద్ నిర్మాతగా నితిన్, ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం చెక్. ఇంటెలిజెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు. ఈ చిత్రం ఫిబ్రవరి 26 తేదీన రిలీజ్‌కు సిద్ధమై ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా జరుపుకొంటున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం ఫిబ్రవరి 21వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాయిచంద్, మిర్చి సంపత్, దర్శకులు గొపిచంద్ మలినేని, వెంకీ కుడుముల పాల్గొన్నారు.

రమా రాజమౌళితో కలిసి
చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆయనతోపాటు రమా రాజమౌళి కూడా వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో మాట్లాడటానికి ముందు తొలి టికెట్‌ను రాజమౌళి, వరుణ్ తేజ్ కొనుగోలు చేశారు. బ్లాక్‌లో టికెట్ కొన్నామని రాజమౌళి ఈ వేడుకలో సెటైర్ వేశారు. దాంతో ఈ వేడుక సందడి సందడిగా మారింది.

కల్యాణీ మాలిక్ రీరికార్డింగ్ అసెట్‌గా
చెక్ సినిమా పీ రిలీజ్ ఈవెంట్‌లో అందరి మాటలు విన్న తర్వాత చెక్ సినిమాకు కల్యాణీ మాలిక్ మంచి మ్యూజిక్ ఇచ్చారని చాలా మంది మాట్లాడినట్టు అర్ధమైంది. ఈ సినిమాలో ఒక్క పాటను విన్నాను. కల్యాణీ మాలిక్ అద్భుతంగా చేశారు. ఒక్క పాట ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. చంద్రశేఖర్ యేలేటికు ఇది తొలి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకొంటాను. అందుకే చాలా టెన్షన్‌తో ఉన్నారు అని రాజమౌళి చెప్పారు.

ఎప్పుడెప్పుడు థియేటర్‌కు వెళ్లి చూడాలాని ఉంది.
ఇక చాలా రోజులుగా థియేటర్‌కు వెళ్లి చూడాలని ఫీలైన చిత్రం చెక్. ఈ సినిమా కాన్సెప్ట్ అలాంటిది. ఇంట్రెస్టింగ్ థీమ్ థియేటర్‌కు వెళ్లి చూడాలనిపించేలా చేసింది. చెక్ సినిమాలో చెస్ కథను నేపథ్యంగా తీసుకోవడం, సినిమా అంతా జైలులోనే తీయడం ఇంట్రెస్ట్ కలిగించింది. చెక్ సినిమా క్లాస్, మాస్ అనే హద్దులను చెరిపివేస్తుంది. వైవిధ్యమైన ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుందని బలంగా నమ్ముతున్నాను అని రాజమౌళి అన్నారు.
Recommended Video

నితిన్ ఎలాంటి పాత్రలనైనా అవలీలగా
నితిన్ విషయానికి వస్తే ఒకే రకమైన సినిమాల్లో నటిస్తారనే వాదనను మరిపిస్తూ చాలా కష్టపడి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి సినిమాల్లోనైనా నటిస్తారనే పేరు తెచ్చుకొన్నారు. చెక్ సినిమాతో మరోసారి నితిన్ పెర్ఫార్మెన్స్ పరంగా నిరూపించుకొంటారని అనుకొంటున్నాను. ఫిబ్రవరి 26న విడుదలయ్యే చెక్ సినిమా ఎదురు చూస్తున్నాను అని రాజమౌళి తెలిపారు.


Click it and Unblock the Notifications











