»   » దర్శక ధీరుడు తేల్చేసాడు: రాజమౌళి మహాభారతం లేనట్టే

దర్శక ధీరుడు తేల్చేసాడు: రాజమౌళి మహాభారతం లేనట్టే

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహా భారతాన్ని తెరకెక్కించాలని ఉందని, అందుకు సంబంధించిన బ్యాగ్రౌండ్ వర్క్ మొదలు పెడతామని దర్శకుడు రాజమౌళి కొన్ని నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. రాజమౌళి ప్రకటనతో చాలా మంది అభిమానులు రాజమౌళి స్టైల్ లో మరోసారి వెండి తెరపై మహా భారతాన్ని చూడబోతున్నాం అంటూ ఆనంద పడ్డారు. అయితే తాజాగా దర్శకుడు రాజమౌళి ఈ సినిమా విషయమై షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

చాలా అనుభవం కావాలి

చాలా అనుభవం కావాలి

బాహుబలికి ముందే ఈ ప్రాజెక్ట్ విషయం లో 'మహా భారతాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలనేది నా కోరి. దానికి చాలా అనుభవం కావాలి. మరో 9 సంవత్సరాల తర్వాత ఆ సినిమా ప్రారంభిస్తానేమో' అంటూ ప్రకటించారు. రాజమౌళి ప్రకటన విన్న అభిమానులు... మరీ అన్ని సంవత్సరాలా? అంటూ అసంతృప్తికి లోనవుతున్నారు.

Mahesh Babu confirms film with SS Rajamouli : Confirmed Officially
మరో దశాబ్దం తర్వాత

మరో దశాబ్దం తర్వాత

9 ఏళ్ల తర్వాత సినిమా ప్రారంభం అయితే అది పూర్తయి విడుదల కావడానికి మరో ఒకటి రెండు సంవత్సరాలు అనదనం. అంటే మరో దశాబ్దం తర్వాత కానీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చే 'మహా భారతం' సినిమాను చూడలేమన్నమాట. అనుకుంటూ నిరాశలో కుంగిపోయారు .

వెబ్‌సైట్లు పబ్బం గడుపుకోవడానికి

వెబ్‌సైట్లు పబ్బం గడుపుకోవడానికి

కొన్నాళ్ళ కిందటే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ విషయం లో రెండు రకాల అభిప్రాయాలని వెలిబుచ్చారు. బాహుబలి కి ముందు మహాభారతాన్ని సినిమాగా తెరకెక్కించాలన్న ఆలోచనే రాజమౌళికి, తనకు లేదని, వెబ్‌సైట్లు పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నాయని చెప్పిన ఆయన. ప్రస్తుతం రాజమౌళి ప్రతీ సెకనును బాహుబలి 2 చిత్రీకరణకే కేటాయిస్తున్నాడని అప్పట్లో ఆయన చెప్పారు. తర్వాత ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి కన్ఫామ్‌గా మహాభారతాన్ని తెరకెక్కిస్తారని స్పష్టం చేశారు.

సినిమా తీస్తానని చెప్పలేదు

సినిమా తీస్తానని చెప్పలేదు

ఇక ఇదే విషయం లో తాజాగా తానుకూడా బయట పెట్టేసాడు రాజమౌళి. "మహా భారతంను సినిమాగా తెరకెక్కించాలన్నది నా కల అని చెప్పానే కానీ సినిమా తీస్తానని చెప్పలేదు. ఇప్పటికైతే ఎలాంటి మూవీని మొదలు పెట్టలేదు. ప్రస్తుతం బాహుబలి-2 సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నా.

కొంతకాలం తర్వాత

కొంతకాలం తర్వాత

కొంతకాలం తర్వాత తదుపరి ప్రాజెక్ట్ మొదలు పెడతా" ఇవి దర్శక ధీరుడు రాజమౌళి మాటలు. కానీ రాజమౌళి మాత్రం తాను మహాభారతం తీయడం లేదని వెల్లడించారు. ప్రేక్షకులు కూడా రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తారని.. ఎంతో ఆశగా ఉన్నారు. మరి రాజమౌళి ఏం చేస్తారో చూడాలి.

English summary
Filmmaker SS Rajamouli denied reports that after breaking records with ‘Baahubali’ franchise, he is making another big budget film based on the Mahabharata, saying that he is not working on anything...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu