For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మెగా డాటర్ నిహారిక హ్యాపీ వెడ్డింగ్.. రెడీ అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్!

  By Rajababu
  |
  SS Thaman Background Score For Niharika's Happy Wedding

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో అత్యంత భారీ వ్యయంతో 4 భాషల్లో ప్రతిష్టాత్మకంగా సాహో చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల జంట‌గా నిర్మిస్తున్న సినిమా "హ్యాపి వెడ్డింగ్" యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ న‌టిస్తున్నారు. 

  ఎస్ఎస్ తమన్ రీరికార్డింగ్

  ఎస్ఎస్ తమన్ రీరికార్డింగ్

  సుమంత్ అశ్విన్, నిహారిక మ‌ధ్య జ‌రిగే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. మ్యూజికల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ కి అద్భుతమైన సంగీతం అందించిన తమన్ రీ రీ రికార్డింగ్ చేస్తుండడం విశేషం. రీ రీ రికార్డింగ్ లో తమన్ మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోవైపు ఫిదా చిత్రం తో సంగీత ప్రియులకు మంచి మ్యూజికల్ ఫీస్ట్ అందించిన శక్తికాంత్ అద్భుతమైన పాటలు అందిస్తున్నారు. తమన్ రీ రీ రికార్డింగ్, శక్తికాంత్ పాటలతో హ్యాపీ వెడ్డింగ్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలవనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

  సుమంత్ అశ్విన్‌, నిహారిక జంట‌గా

  సుమంత్ అశ్విన్‌, నిహారిక జంట‌గా

  ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్ర‌మ‌లో వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న‌ క్రేజీ బ్యాన‌ర్ యు వి క్రియేష‌న్స్ వంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ తో కలిసి మేము "హ్యాపి వెడ్డింగ్" చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాము. సుమంత్ అశ్విన్‌, నిహారిక జంట‌గా న‌టిస్తున్నారు. ఫిదా లాంటి మ్యూజిక్ ఛార్ట్‌బ‌స్ట‌ర్ ని అందించిన శక్తికాంత్ కార్తిక్ మా చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పుడు ఈ హ్యాపీ వెడ్డింగ్ ప్రాజెక్టు లోకి తమన్ ఎంటర్ అయ్యారు. తనదైన రీ రీ రికార్డింగ్ తో మెస్మరైజ్ చేయబోతున్నారు.

  పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్‌లో బిజీగా

  పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్‌లో బిజీగా

  రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కిన‌ ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా వుంది. ల‌క్ష్మ‌ణ్ కార్య మంచి విజన్ ఉన్న దర్శకుడు. పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగే రోజు వ‌ర‌కు రెండు కుటుంబాల మధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా మా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు నిర్మాతలు పేర్కొన్నారు.

  వాస్తవ జీవితానికి దగ్గరగా

  వాస్తవ జీవితానికి దగ్గరగా

  ప్ర‌తి ఒక్క‌రి జీవితం లో ఇలాంటి అనుభ‌వం జ‌రిగివుంటుంది. ప్ర‌తి ప్రేక్ష‌కుడు త‌మ‌ని తాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న హ్యాపీ వెడ్డింగ్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది అని పాకెట్ సినిమా నిర్వాహకులు అన్నారు..

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నిహారిక, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు..

  సాంకేతిక నిపుణులు..యువి క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో మ్యూజిక్ డైరెక్టర్ - శక్తికాంత్, రీ రీ రికార్డింగ్ - ఎస్. ఎస్. తమన్,

  కెమెరా - బాల్ రెడ్డి, మ్యూజిక్ - శ‌క్తికాంత్ కార్తీక్‌, నిర్మాత‌ - పాకెట్ సినిమా, ద‌ర్శ‌క‌త్వం - ల‌క్ష్మ‌ణ్ కార్య‌

  English summary
  After the failure of her debut film 'Oka Manasu', Niharika took a huge sabbatical before signing her second Telugu film, "Happy Wedding". Happening production house UV Creations is presenting this youthful entertainer that is being bankrolled by Pocket Cinema. Struggling hero Sumanth Ashwin plays the male lead. The film's shooting has almost been wrapped up and the post-production work is in full swing. There is news that SS Thaman doing back ground score for the music. Music given Fidaa fame Shaktikanth.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more