For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాధేశ్యామ్ ను సపోర్ట్ చేస్తూ థమన్ కామెంట్స్.. బలుపు స్టేట్మెంట్స్ వద్దంటూ రెచ్చిపోయిన నెటిజన్లు

  |

  ఎస్ఎస్ థమన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో క్లౌడ్ 9లో ఉన్నారు. ఆయన అందించిన సంగీతం సినిమాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఆయన పడుతున్న కష్టానికి తగ్గట్టే ఆయన ఈ రోజు టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడుగా మారారు. అయితే ఈ వరుస సక్సెస్‌తో థమన్ కు గర్వం తలకెక్కింది అని నెటిజన్లు అభిప్రాయం పడుతున్నారు. రాధేశ్యామ్ సినిమా బాలేదని, స్లోగా సినిమా ఉందని కామెంట్స్ చేసిన వారి గురించి రాధే శ్యామ్ పోస్ట్-రిలీజ్ ప్రెస్‌మీట్‌లో చేసిన థమన్ కామెంట్స్ చర్చనీయంశంగా మారాయి.

  నేపథ్య సంగీతంతో

  నేపథ్య సంగీతంతో

  ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడిక్ లవ్ స్టోరీ 'రాధేశ్యామ్‌'. గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ నిర్మించగా కె.రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, జయరామ్‌, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైన నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ బాగుంది. ప్రభాస్‌, పూజాల నటన, కెమిస్ట్రీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. తమన్‌ నేపథ్య సంగీతంతో మ్యాజిక్‌ చేశారు అని అన్నారు.

  కౌంటర్ వేసే ప్రయత్నం

  కౌంటర్ వేసే ప్రయత్నం

  నిజానికి ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి నెగటివ్ రివ్యూ వచ్చింది. మరీ ముఖ్యంగా సినిమా చాలా స్లో గా ఉందని, ప్రభాస్ రేంజ్ కి సరిపోయే సినిమా కాదని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విమర్శలు థమన్ కి నచ్చలేదేమో. ఈ ప్రెస్ మీట్ లో రెచ్చిపోయి క్రిటిక్స్ మీద కామెంట్ చేశాడు. క్రిటిక్స్ ఏమైనా సెపెరేట్ కాలేజ్ నుంచి వచ్చారా, వాళ్ళూ మనలాంటి ఆడియన్స్ కదా అంటూ కౌంటర్ వేసే ప్రయత్నం చేశారు థమన్.

  ఆశలపై నీళ్లు చల్లాడు

  ఆశలపై నీళ్లు చల్లాడు

  మీడియా అడిగిన ప్రతి ప్రశ్నకు అడ్డు పడుతూ ఒకరకంగా ఏంటి థమన్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని అనిపించేలా చేశాడు. నిజానికి ఇంతకు ముందు థమన్ సంగీతం అందించిన అఖండ విషయంలో ఇదే క్రిటిక్స్ థమన్ ని ఆకాశానికి ఎత్తేశారు. అప్పుడు ఎంజాయ్ చేసిన థమన్ ఇప్పుడు మాత్రం తనని అనరాని మాట ఏదో అనేసినట్టు ఫీల్ అయిపోవడం చర్చనీయాంశంగా మారింది. సినిమా టాక్ తేడాగా ఉంది, ఏదో ఒక విధంగా పాజిటివ్ చేయాలని దర్శకుడు ఆలోచిస్తే థమన్ ఆయన ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లాడు.

  వివాదాస్పద వ్యాఖ్యలు

  వివాదాస్పద వ్యాఖ్యలు

  సినిమా నచ్చలేదన్న వారిని తక్కువ చేసి చూపించే ప్రయత్నంలో థమన్ చాలా అసభ్యంగా మాట్లాడారు. అయితే, చివరి నిమిషంలో రాధే శ్యామ్‌లోకి ప్రవేశించిన థమన్ ఈ సినిమాను ఎందుకు ఇంత వెనకుసుకు వస్తున్నారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. థమన్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. అల వైకుంఠపురములో సక్సెస్ మీట్‌లో సరిలేరు నీకెవ్వరు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

  Recommended Video

  Thaman On Radhe Shyam BGM : జస్టిన్ పాటల్ని వాడుకున్నా అంతే .. క్రెడిట్ అతనికే | Filmibeat Telugu
  తప్పేమిటో ఆలోచించి

  తప్పేమిటో ఆలోచించి


  ఇప్పుడు ఆయన చేసిన ఈ నోటి దురద కామెంట్స్ వలన నెటిజన్లు ఆయన మీద కామెంట్లు చేస్తున్నారు. మేము పెట్టె డబ్బుకి న్యాయం జరగక పోతే అడిగే హక్కు మాకుందని కొందరు అంటుంటే, టైం నడుస్తుందని గు* బలుపు కామెంట్స్ వద్దన్నా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. సినిమా చూసిన వారు సినిమా నచ్చిందని ఎలా చెబుతున్నారో నచ్చని వారు నచ్చలేదని చెప్పడంలో తప్పేమిటో ఆలోచించి థమన్ కామెంట్లు చేస్తే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.


  English summary
  SS Thaman degrading comments on critics gone viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X