»   »  దిల్ రాజు సినిమా... సమంత చేతుల మీదగా ఆడియో రిలీజ్ ఈ రోజే

దిల్ రాజు సినిమా... సమంత చేతుల మీదగా ఆడియో రిలీజ్ ఈ రోజే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్ జంట‌గా బ‌క్కియ రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లవ్ ఎంట‌ర్‌టైన‌ర్ రెమో. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఈ రోజు (నవంబర్ 1) న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇక ఈ చిత్రం యొక్క ఆడియో ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్లో భారీ ఎత్తున జరగనుంది. ఈ ఆడియోను తెలుగు స్టార్ హీరోయిన్ సమంత చేతులమీదగా విడుదల చేయనున్నట్లు సమాచారం. సమంత..గతంలోదిల్ రాజు బ్యానర్ లో సినిమాలు చేసిన విషయం తెలిసిందే.

Star actress samantha to launch Remo audio

దిల్ రాజు మాట్లాడుతూ - "హీరో శివ‌కార్తికేయ‌న్ రెమో సినిమాలో మూడు వేరియేష‌న్స్‌లో అద్భుతంగా యాక్ట్ చేశాడు. పి.సి.శ్రీరాంగారి సినిమాటోగ్ర‌ఫీ, అనిరుధ్ సంగీతం సినిమాకు మ‌రింత స‌పోర్ట్ చేశాయి. రెమో ష్యూర్ షాట్ హిట్ మూవీ అవుతుంది. డెబ్యూ డైరెక్ట‌ర్ బక్కియ రాజ్ క‌న్న‌న్ చేసిన సినిమా త‌మిళనాడులో 65-70 కోట్లు క‌లెక్ట్ చేయ‌డం చిన్న విష‌యం కాదు. రెమో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అవుతున్న శివ‌కార్తికేయ‌న్‌కు అభినంద‌న‌లు. ఈ చిత్రం ఆడియో నవంబర్ 1 న విడుదల అవుతుంది" అన్నారు.

Star actress samantha to launch Remo audio

మొదటిసారి శివకార్తికేయన్ చిత్రం తెలుగులోకి విడుదల అవుతుండటంతో సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గట్టి ప్రమోషన్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'నేను శైలజా' చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి పరియచం అయిన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించడంతో తెలుగులో సైతం ఈ సినిమాపై క్రేజ్ క్రియేట్ అవుతోంది. ఇకపోతే బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా, అనిరుద్ సంగీతం సమకూర్చారు.

English summary
Telugu audio of Shiva Kartikeyan’s Remo will be launched today evening in Hyderabad. The latest news is that star actress Samantha will be the chief guest at the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu