»   » అక్కకంటే దారుణంగా..., ఐరన్‌లెగ్ అంటున్నారు పాపం

అక్కకంటే దారుణంగా..., ఐరన్‌లెగ్ అంటున్నారు పాపం

Posted By:
Subscribe to Filmibeat Telugu

తండ్రులో తల్లులో సినీ స్టార్లు అయినంత మాత్రాన వారి వారసులుగా వచ్చే వారికి కూడా కెరీర్ పూలబాట అవుతుందనుకుంటే పొరపాటే. స్టార్టింగ్ బూస్ట్ కోసం ఆ బ్యాక్‌గ్రౌండ్ ఉపయోగ పడుతుందేమో కానీ తర్వాత ఆ ఇమేజ్ ఏమాత్రం పనికి రాదు. ఒకటో రెండో వరుస ఫెయిల్యూర్స్ వచ్చాయంటే ఇక స్ట్రగుల్ స్టార్ట్ అయినట్టే. అదే పరిస్త్ఝితుల్లో ఉంది ఇప్పుడు కమల్ హసన్ రెండో కూతురు అక్షర హసన్. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగాలనుకుంటున్న ఈ స్టార్ డాటర్‌పై ఐరెన్ లెగ్ అనే ముద్రపడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కమల్ హాసన్ ఇద్దరు కూతుళ్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా ఉన్నారు. పెద్ద కూతురు శ్రుతి హాసన్ ఇప్పటికే క్రేజీ హీరోయిన్ అనే ఇమేజ్ తెచ్చుకోగా.. చిన్నమ్మాయి అక్షర హసన్ కూడా అక్క శ్రుతి హాసన్ తరహాలోనే క్రేజీ బ్యూటీ అనిపించుకోవడానికి కష్టపడుతోంది. అక్షర హాసన్‌కు స్టార్ హీరోయిన్ ఇమేజ్ వస్తుందో లేదో తెలియదు కానీ, అమ్మడు ఐరెన్ లెగ్ అని కోలీవుడ్‌లోని కొందరు ఫిక్స్ అయినట్టు గుసగుగుసలు మొదలయ్యాయి.

Star Daughter and Sister Akshara hasan Turns Iron Leg

అమితాబ్, ధనుష్ నటించిన షమితాబ్ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అక్షర హాసన్... ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో బాగా డిజప్పాయింట్ అయ్యింది. అయితే హీరోయిన్‌గా సక్సెస్ అందుకోవాలనే తన ప్రయత్నాలను మాత్రం కంటిన్యూ చేస్తోంది. ఈ క్రమంలో అక్షర సైన్ చేసిన ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్... కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది.

ఇక అక్షర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న శభాష్ నాయుడు అనే సినిమా షూటింగ్ కొంతకాలం వాయిదా పడింది. దీంతో ఈ స్టార్ డాటర్‌ను ఐరెన్ లెగ్ అనేస్తున్నారు కొందరు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి మొదట్లో శృతీ హసన్ కూడా వరుస ఫ్లాపులతొ ఇదే తరహా ఐరన్ లెగ్ అనే అనిపించుకుంది. అయితే తర్వాత కాలం లో మాత్రం తానే కొన్ని సినిమాల విజయానికి కారణం కూడా అయ్యింది. అందుకే ఇప్పుడు అక్షర కూడా అలా స్ట్రగుల్ పడుతోందే తప్ప ఆమెకు ఖచ్చితంగా గొప్ప భవిశ్యత్ ఉందనేది మరికొందరి అభిప్రాయం.

అయినా ఇండస్ట్రీలో ఉండే కొన్ని సెంటిమెంట్లు ఎప్పటికప్పుడు మారిపోతూంటాయ్. అప్పటివరకూ చెడు అనుకున్నదే ఒక్క బ్లాక్బస్టర్ హిట్ పడిందంటే శుభశకునం కింద మారిపోతుంది. అలాగే ఈ ఐరన్ లెగ్ కూడా కొన్నాళ్ళకి గోల్డ్ కింద మారిపోతుందనే అనుకుంటున్నారన్నమాట. ప్రస్తుతం అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వివేగం సినిమాలో యాక్ట్ చేస్తున్న అక్షర... ఈ సినిమాతో సక్సెస్ అందుకుని తన మీద పడిన ముద్రను చెరిపేసుకుంటుందేమో చూద్దాం.

English summary
Universal Hero Kamal Haasan and his elder daughter Shruti Haasan is currently one of the top actresses in South. However, Kamal’s younger daughter and Shruti’s darling sister Akshara Haasan has been tagged as an iron leg.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu