»   » తల్లితండ్రులతో కలిసి స్టార్ హీరో..తిరుమల (ఫొటో)

తల్లితండ్రులతో కలిసి స్టార్ హీరో..తిరుమల (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమిళ స్టార్ హీరో అజిత్ తన తల్లి తండ్రులతో కలిసి తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ తీసిన ఫొటో ఇది. అజిత్ తన ట్రేడ్ మార్క్ లుక్ లో అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన తిరుమలకు రావటంతో అక్కడ ఉన్న అభిమానులను ఆయన్ని చూడటానికి ఎగబడ్డారు. మీరూ ఆ ఫొటో చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆయన తాజా చిత్రం విషయానికి వస్తే...

అజిత్‌ హీరోగా నటిస్తున్న 'ఎన్నై అరిందాల్‌' చిత్రానికి ముగ్గురు దర్శకత్వం వహించినట్లు తెలిసింది. ఈ చిత్ర ప్రధాన దర్శకుడు గౌతం మీనన్‌. గౌతం మీనన్‌ మాట్లాడుతూ '' ఈ చిత్రం అజిత్‌ కోసమే సిద్ధం చేశా. చిత్రీకరణ తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని భావిస్తున్నాం. ఈ కారణంగా నాతోపాటు దర్శకులు శ్రీధర్‌ రాఘవన్‌, త్యాగరాజ కుమారరాజ పనిచేస్తున్నారు. వారిని సాయం కోరగానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టార''ని తెలిపారు.

అజిత్‌ మాట్లాడుతూ.. '' ఇది ఎప్పటిలాగానే నాకోసం తయారైన చిత్రంలా ఉండకూడదు. ప్రత్యేకించి గౌతమ్‌ మీనన్‌ తరహాలో రూపొందించిన సినిమాలా కనిపించాలన్నదే నా అభిమతము''అని వివరించారు. తెలుగులో ఈ చిత్రం ‘ఎంతవాడుగానీ'..అనే టైటిల్ తో విడుదల అవుతోంది.

Star Hero Ajith with his Parents at Tirumala!

చిత్రం వివరాల్లోకి వెళితే..

స్టార్‌ హీరో అజిత్‌, గౌతమ్‌ మీనన్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ ఎంతవాడుగానీ '. ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం పర్యవేక్షణలో శ్రీ సాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మస్తున్న ఈ చిత్రంలో అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. ‘ ఐ ', ‘ లింగ ' చిత్రాల తరహాలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో ఈనెలలోనే రిలీజ్‌ కానుంది.

దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ మాట్లాడుతూ - ‘‘ ఇందులో మూడు షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో అజిత్‌ నటిస్తున్నారు. అనుష్క ఫారిన్‌ నుంచి వచ్చిన మోడ్రన్‌ గర్ల్‌గా నటిస్తుండగా, త్రిష సంప్రదాయ కుంటుంబం నుంచి వచ్చిన క్లాసికల్‌ డాన్సర్‌గా చేస్తున్నారు. ఇంతకుముందు తమిళ్‌లో హీరోగా చాలా సినిమాల్లో నటించిన అరుణ్‌ విజయ్‌ ఈ చిత్రంలో అజిత్‌కి ఈక్వెల్‌గా వుండే నెగెటివ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. ఆయన సరసన పార్వతి నాయర్‌ నటిస్తున్నారు. ఆశిష్‌ విద్యార్థి, సుమన్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. హారీస్‌ జైరాజ్‌ ఈ చిత్రానికి ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఇందులో ఏడు పాటలు వుంటాయి. అజిత్‌ కాంబినేషన్‌లో నేను చేస్తున్న ఈ సినిమా మరో సెన్సేషనల్‌ కమర్షియల్‌ ఫిలిమ్‌ అవుతుందన్నారు.''

నిర్మాత ఎస్‌.ఐశ్వర్య మాట్లాడుతూ- ‘‘ ఎనిమిది నెలలుగా ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. చెన్నై, రాజమండ్రి, మలేషియా వంటి డిఫరెంట్‌ ప్లేసెస్‌లో షూటింగ్‌ చేశాము. అలాగే జోధ్‌పూర్‌, జైపూర్‌, పెల్లింగ్‌, గ్యాంగ్‌టక్‌ వంటి ప్రదేశాల్లో అజిత్‌పై చిత్రీకరించిన పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది.

ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్‌ అయిన తమిళ చిత్రం టీజర్‌కి యూ ట్యూబ్‌లో ఇప్పటికే 10 లక్షల హిట్స్‌ వచ్చాయి. ఎన్‌.టి .రామారావు గారి సూపర్‌హిట్‌ సాంగ్‌ అయిన ‘ఎంతవాడు గానీ, వేదాంతులైన గానీ' అనే పాటలోని పల్లవిని తీసుకొని ఎంతవాడు గానీ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి పెట్టడం జరిగింది. ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం.'' అన్నారు.

English summary
Ajith visited Tirumala along with his parents on Wednesday to seek the blessings of Lord Venkateswara Swamy.
Please Wait while comments are loading...