»   » స్టార్ హీరో రవితేజ లైఫ్ హిస్టరీ ఇదే...

స్టార్ హీరో రవితేజ లైఫ్ హిస్టరీ ఇదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరసగా సినిమాలు చేసుకుపోతున్న హీరో రవితేజ లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబం, కెరీర్ వివరాలు తెలియచేసారు. ఆయన చెప్పిన దాని ప్రకారం రవితేజ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. అతని అసలు పేరు భూపతిరాజు రవిశంకర్‌ రాజు దానిని సినిమాల్లోకి వచ్చాక రవితేజగా మార్చుకున్నారు. ముగ్గురు సోదరులలో తనే పెద్దవాడినన్నారు. అలాగే తన బాల్యం జైపూర్‌, ఢిల్లీ, ముంబయ్‌, భోపాల్‌లో గడిచిందన్నారు. నాన్న ఫార్మసిస్ట్‌ గా ఈ ప్రాంతాల్లో పనిచేశారని చెప్పారు. విజయవాడలో కొంతకాలం పాటు తమ కుటుంబం నివసించిందని తాను అక్కడే సిద్దార్థ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశానని చెప్పారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన అనంతరం 1988లో సినిమాల్లో చేసేందుకు చెన్నైనకి వెళ్లానని చెప్పారు.

ఇక 2002లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గణపవరం ప్రాంతానికి చెందిన కళ్యాణితో తన వివాహం జరిగిందని చెప్పారు. చిన్నతనం నుంచే తాను సినిమాల్లో హీరోగా చేయాలని కలలు కంటుండేవాడినన్నారు. ప్రారంభంలో తాను సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశానని వివరించారు. వీటిలో తెలుగుతో పాటు హిందీ సినిమాలు సైతం ఉన్నాయన్నారు. హిందీలో ప్రతిబంధ్‌, ఆజ్‌ కా గూండారాజ్‌, క్రిమినల్‌ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశానన్నారు. కృష్ణవంశీ దర్వకత్వంలో మొదటగా సింధూరంలో లీడ్‌ రోల్‌చేశానని ఇది తనకెంతో పేరుతెచ్చిపెట్టిందన్నారు. 1999లో శ్రీను వైట్ల దర్శ త్వంలో నీ కోసం సినిమా చేశానని అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదన్నారు..ప్రస్తుతం డాన్‌ శీను, వీర, మిరపకాయ, కత్తిలాం టోడు, కందిరీగ చిత్రాలు చేస్తున్నట్టు రవితేజ వివరించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu