»   » రామ్ చరణ్ శ్రియా కలిసి నటించారని తెలుసా? ఈ వీడియో చూడండి...

రామ్ చరణ్ శ్రియా కలిసి నటించారని తెలుసా? ఈ వీడియో చూడండి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ సినిమాల్లోకి వచ్చే నాటికే శ్రియ కెరీర్ తగ్గుముఖం లో ఉంది. అప్పటికే ఆమె దాదాపుగా టాలీవుడ్ లో హీరోయిన్ గా దూరమైపోయింది. అయితే చరణ్ శ్రియ కలిసి నటించారని తెలుసా? మీరు చదివింది నిజమే రామ్ చరణ్ శ్రియా కలిసి నటించారు. అయితే అది ఇప్పుడు కాదు దాదాపు రామ్ హీరో అవ్వకముందే.

సినిమాలోకి రాకముందు

సినిమాలోకి రాకముందు

యాక్టింగ్, డ్యాన్సింగ్, ఫైట్స్ విషయంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. అలా శిక్షణలో ఉన్న సమయంలో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చరణ్ ముంబైలోని యాక్టింగ్ ఇన్సిస్టిట్యూట్ లో ఉండగా తీసినదని తెలుస్తోంది.

యాక్టింగ్ లో

యాక్టింగ్ లో

రామ్ చరణ్ సినిమాల్లోకి వచ్చేముందు ముంబయిలోని ఓ ఇన్ స్టిట్యూట్ లో యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ సమయంలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న శ్రియ సరన్ ఆ ఇన్ స్టిట్యూట్ ను విజిట్ చేసింది. యంగ్ స్టర్స్ లో ఉత్సాహం నింపేందుకు ఇన్ స్టిట్యూట్ నిర్వాహకులు ఆమెను ప్రత్యేక అతిథిగా అక్కడకు ఆహ్వానించారు.

రామ్ చరణ్ - శ్రియ

రామ్ చరణ్ - శ్రియ

ఈ సందర్భంగా రామ్ చరణ్ - శ్రియ కలిసి ఓ సీన్ పెర్ఫార్మ్ చేశారు. దశాబ్దం క్రితమే జరిగిన ఈ ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో దర్శనమిస్తోంది. ఇందులో రామ్ చరణ్ నల్లకోటు వేసుకుని... కళ్లజోడు పెట్టుకుని పొడిపొడి మాటలు మాట్లాడుతూ ఒకింత నెర్వస్ గా కనిపించాడు.

శ్రియ

శ్రియ

శ్రియ అప్పటికే టాప్ యాక్టర్ కావడంతో ముగ్ధ మనోహరంగా కనిపిస్తూనే యాక్టింగ్ అంటే ఇలా ఉండాలన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టేసింది. రొమాంటిక్ సన్నివేశాన్ని ఇద్దరూ మొత్తానికి చక్కగానే రక్తి కట్టించారు. అయితే ఇప్పుడు ఎలా వచ్చిందో గానీ ఆ వీడియో నెట్ లో వైరల్ గామారింది.

సోషల్ మీడియాలో

నిన్నటినుంచీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇప్పుడు ఉన్న చరణ్ కీ అప్పుడు ఉన్న చరణ్ కీ మధ్య చాలా తేడా ఉన్నా. శ్రియా మాత్రం అప్పుడూ ఇప్పుడూ ఒక్కలాగే ఉంది. ఈ వీడియో అటు మెగా అభిమానులనూ ఇటు శ్రియా అభిమానులనూ బాగానే అలరిస్తోంది.

English summary
Ram Charan and Shriya Saran acted in a romantic scene which none are aware of till date. This happened over a decade ago when Shriya was the top heroine in the south and Ram Charan is yet to make his Screen debut.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu