»   » అటు బన్ని డాన్స్..ఇటు బాలయ్య పాట (వీడియో)

అటు బన్ని డాన్స్..ఇటు బాలయ్య పాట (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: వెలుగు జిలుగుల మధ్య.. తారల హంగామాతో అంగరంగ వైభవంగా సాగిన సౌత్‌ ఇండియన్‌ మూవీ అవార్డ్స్‌(సైమా)-2015 వేడుక ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన తారలంతా ఒక్కచోట చేరి ప్రేక్షకులకు కనువిందు చేశారు. తొలిరోజు తెలుగు, కన్నడ, రెండో రోజు తమిళం, మలయాళం విజేతలకు అవార్డులనందించారు.

తమిళ హీరో ధనుష్‌, హన్సిక, సంగీత దర్శకుడు అనిరుధ్‌ తదితరులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. మురుగాదాస్‌ దర్శకత్వంలో రూపొందిన 'కత్తి' ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. శ్రుతిహాసన్‌ తన నృత్య ప్రదర్శనతో ఉర్రూతలూగించింది. తారల హంగామాతో సైమా వేడుక సందడిగా సాగింది. ఈ అవార్డుల పంక్షన్ కు సంభందించిన ప్రోమో ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ ఆవార్డ్స్‌ (సైమా) నిర్వహించిన ఈ 'కన్నుల పండుగ'లో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలకు చెందిన హేమాహేమీలు, యువ తరంగాలు సందడి చేశాయి. రెండు రోజుల పాటు సాగిన వేడుకలో తొలి రోజు తారల హుషారుకి ఈ చిత్రాలే గీటురాళ్లు. హీరోయిన్స్ తమ అందచందాలతో నియాన్‌ లైట్ల వెలుగులను చిన్నబోయేలా చేశారు.

Stars At SIIMA Awards 2015 - Promo

ఈ సందడి నడుమ గతేడాదికిగాను తెలుగు, కన్నడ పరిశ్రమలకు సంబంధించిన విజేతలకు పురస్కారాలు అందించారు.దివంగత ప్రముఖ నిర్మాత రామానాయుడు జ్ఞాపకార్థం బాలకృష్ణ, అల్లు అరవింద్‌, భారతీరాజా, సుహాసిని చేతులమీదుగా రామానాయుడు కుటుంబ సభ్యులు వెంకటేష్‌, రానా, నాగచైతన్యకు జ్ఞాపికను అందజేశారు.ప్రముఖ గాయని ఉషా ఉతుప్‌ హుషారైన గానంతో అలరించారు. బాలకృష్ణ, వెంకటేష్‌ ఆమెతో గొంతు కలిపి డ్యాన్స్‌లూ చేశారు.

కుష్బూ, శ్రుతి హాసన్‌ వీళ్లతో కాలు కదిపి మరింత ఉత్సాహాన్ని పెంచారు.బాలకృష్ణ, రాశీ ఖాన్నా, చంద్రబోస్‌, పీటర్‌ హెయిన్స్‌, శ్రియ, సుహాసిని, బ్రహ్మానందం, శ్రుతి హాసన్‌ పురస్కారాలందుకున్నారు.ప్రణీత, పూజా హెగ్డే, అదా శర్మ, శ్రియ, అమలాపాల్‌ నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి.దేవిశ్రీప్రసాద్‌, మంచు లక్ష్మీప్రసన్న, ఛార్మి, పూజా కుమార్‌, రెజీనా, సోనాల్‌ చౌహాన్‌, తదితరులు హాజరయ్యారు.'

English summary
As Indian cinema is making a strong impact globally, it’s time for South Indian Cinema to claim its space in the realm of world cinema. It’s time the Telugu, Tamil, Kannada and Malayalam industries took the centre stage worldwide and welcome an entertaining endeavour of its sorts- SIIMA.
Please Wait while comments are loading...