»   » టీవీ ఛానెల్స్ లో కనపిస్తే ఫిల్మ్ ఛాంబర్ వేటు

టీవీ ఛానెల్స్ లో కనపిస్తే ఫిల్మ్ ఛాంబర్ వేటు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిత్ర పరిశ్రమ సంబంధీకుల టీవీ కార్యక్రమాల్లో పాల్గొనడం అక్కడ పారితోషకం తీసుకోడం సబబు కాదని, దీనివల్ల థియేటర్లలో కలక్షన్లు పడిపోతున్నాయని, కనుక సినీ కళాకారులు సీనీ పరిశ్రమకు విశ్వాస పాత్రులుగా ఉండాలని ప్రముఖ మళయాళ నటుడు సురేష్‌ గోపి అన్నారు. రీసెంట్ గా నటీనటులు, గాయనీ గాయకులు, ఇతర సాంకేతిక నిపుణులు టీవీ రియాల్టి షోలలో గానీ, టీవీ ఇతర కార్యక్రమాల్లో యాంకర్లుగా గాని జడ్జీలుగా గాని వ్యవహరించకూడదంటూ కేరళ ఫిల్మ్ ఛాంబర్ అల్టిమేటం జారీ చేసింది. ఈ నిభందనను మే 1 నుండి అమలు లోకి వస్తుంది. ఈ తేదీ తర్వాత కూడా టీవీ ఛానెల్స్‌ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటే వారు నటించిన చిత్రాలు ప్రదర్శనకు నోచుకోవని, సినిమాల్లో నటించే అవకాశాలు కూడా పూర్తిగా కోల్పోతారని హెచ్చరిస్తూ తీర్మానం చేసింది.

ఏప్రిల్‌ 8న కేరళ ఫిలిం ఛాంబర్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో గందరగోళం సృష్టిస్తోంది. కేరళ ఫిలిం ఛాంబర్‌ తీసుకున్న ఈ నిర్ణయం మళయాళ చిత్ర పరిశ్రమలో చాలామందికి ఇబ్బందిగా మారింది. దాంతో బాహాటంగానే ఈ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. పేరున్న కళాకారులు సాంకేతిక నిపుణులకు సినీరంగంలోనూ ఎక్కువ పారితోషకమే ముడుతుంది. వాళ్ళు టీవి రంగం వేపు మొగ్గు చూపితే అక్కడా పారితోషకం బాగానే లభిస్తుంది. ఎటొచ్చీ తక్కువ సినిమాలు చేసేవారు, ఒక మాదిరి రేంజ్‌ వున్నవారికి అక్కడా ఇక్కడా కూడా నామమాత్రంగానే పారితోషకం లభిస్తుంది. వేణ్ణీళ్ళకు చన్నీళ్ళలా ఇవి ఉపయోగపడుతుందని కళాకారులు భావిస్తున్నారు. ఇక తెలుగు, తమిళ పరిశ్రమలలోని నిర్మాతలు కూడూ ఆ నిర్ణయం బాగుందనిపించి ఇక్కడా అమలు పరస్తారేమోనని టీవీల్లో తిరుగుతున్నవారు భయపడుతున్నారు. అయితే గాయనీ గాయకులపై ఛాంబర్‌ ఆంక్షలు విధించడం సబబు కాదన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu