»   » అప్పుడు స్పీల్‌బర్గ్ గేలి చేశాడు.. ఇప్పుడు బాహుబలి చూసి కామెంట్ చేయ్.. కృష్ణంరాజు

అప్పుడు స్పీల్‌బర్గ్ గేలి చేశాడు.. ఇప్పుడు బాహుబలి చూసి కామెంట్ చేయ్.. కృష్ణంరాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సినిమా గురించి చెప్పేముందు తాము మరిచిపోలేనటువంటి వ్యక్తి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అని రెబల్ స్టార్ కృష్ణంరాజు అన్నారు. బాహుబలి 2 కన్‌క్లూజన్ చిత్ర ప్రీ రిలీజ్ లో కృష్ణంరాజు మాట్లాడుతూ.. ప్రపంచం అంతా చెప్పుకునే విధంగా రాజమౌళి కుటుంబం సినిమా రూపొందించింది అని చెప్పారు.

Baahubali2
ఇండియన్ సినిమాను స్పీల్‌బర్గ్ కామెంట్

ఇండియన్ సినిమాను స్పీల్‌బర్గ్ కామెంట్

ఒకసారి భారతీయ సినిమా పరిశ్రమ గురించి ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కామెంట్ చేయమంటే నిరాకరించారు. అయినా పదే పదే అడుగడంతో ఒకే కథతో వేల కొద్ది సినిమాలు ఎలా చేస్తారని ఆయన గేలి చేశారని కృష్టంరాజు గుర్తు చేశారు.

ఇప్పుడు కామెంట్ చేయి స్పీల్ బర్గ్

ఇప్పుడు కామెంట్ చేయి స్పీల్ బర్గ్

అయ్యా స్పీల్ బుర్గ్‌.. ఇప్పుడు బాహుబలి సినిమాను ఇప్పుడు చూసి ఇండియన్ సినిమా గురించి కామెంట్ చేయమని ప్రేక్షకులు అంటున్నారు అని రెబల్ స్టార్ అన్నారు. తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడటం వెనుక రాజమౌళి కుటుంబం విశేష కృషి ఉందని తెలిపారు.

రాజమౌళి స్పీల్ బర్గ్ అంతటివాడు..

రాజమౌళి స్పీల్ బర్గ్ అంతటివాడు..

రాజమౌళి స్పీల్ బర్గ్ అంతా గొప్పవాడు కాదు. కానీ అంతటి గొప్పవాడు అవుతాడనడంలో సందేహం లేదు. నా 50 ఏండ్ల కెరీర్‌లో ఇండియన్ సినిమా గురించి తక్కువ చేసి మాట్లాడేవారు. ఇప్పుడు ఢిల్లీ, చెన్నై గురించి వెళితే బాహుబలి గురించి, కట్టప్ప గురించే మాట్లాడుతుంటారు.

మోదీపై బాహుబలి ప్రభావం..

మోదీపై బాహుబలి ప్రభావం..

బాహుబలి ప్రభావం ప్రధాని మోదీపై కూడా పడింది. ఆయన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బాహుబలిని ప్రస్తావించడాన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఏంటో తెలిసింది. ప్రధానమంత్రి కుర్చీ కాపాడుకోవడానికి కట్టప్పగా మారుతానని మోదీ అన్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పారు.

English summary
Steven Spielberg watch baahubali and comment it,challenges Krishnam Raju. He said Rajamouli family takes Indian cinema to global arena with Baahubali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu