twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బస్‌స్టాప్’చిత్రం పై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'ఈ రోజుల్లో' ఫేం మారుతి తాజా చిత్రం 'బస్‌ స్టాప్‌' రెండు వారాల క్రితం విడుదలై మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 'లవర్స్ అడ్డా' అనేది ఉపశీర్షికతో వచ్చిన ఈ సినిమాలో అసభ్య, శృంగార సన్నివేశాలతో పాటు బూతు,ద్వందార్థాలతో కూడిన డైలాగులు ఉన్నాయని, వెంటనే సినిమాను నిలిపేయాలని పలువురు గురువారం మానవహక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. సినిమాల పేరుతో కుటుంబ సంబంధాలకు పెడర్థాలు ఆపాదించిన నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శకుడు మారుతీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సరూర్‌నగర్ మండల కాంగ్రెస్ యువజన నాయకుడు, న్యాయవాది పి.సాయికృష్ణఆజాద్ ఫిర్యాదులో కోరారు.

    దర్శకుడు మారుతి తన చిత్రంలో బూతులున్నాయన్న విషయం ఖండిస్తున్నారు."బస్‌స్టాప్‌లో నేను తెరకెక్కించిన సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులకు తెలియనివేమీ కాదు. చాలా మంది మధ్యతరగతి ఇళ్లలో జరుగుతున్నవే. 'ఈరోజుల్లో' చిత్రం ఇచ్చిన ప్రోత్సాహంతో 'బస్‌స్టాప్'ను తీయగలిగాను. సున్నితమైన అంశాన్ని తెరమీద చర్చించాను. పలువురికి సూటిగా తగిలింది. సినిమా చూసినవారందరూ మంచి సినిమా అని మెచ్చుకుంటున్నారు'' అని అన్నారు.

    అలాగే "బస్‌స్టాప్‌ను రూ.1.75కోట్లతో తీశాను. చాలా పెద్ద విజయాన్ని మూటగట్టుకుంది. సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించా. యువత బ్రహ్మరథం పడుతున్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉండే గ్యాప్‌ను చూపించాను. పిల్లలను కట్టుదిట్టం చేసినా చెడిపోతారు. అతి గారాబం ఇచ్చినా చెడిపోతారన్న విషయాన్ని చెప్పా. నేను చర్చించిన అంశంలోని పెయిన్ తెలిసినవారు ఎంత బాగా చెప్పాడోనని కితాబిస్తున్నారు. అర్థం కాని వారు మాత్రం బూతును వెతుకుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మధ్యతరగతి సినిమాను ప్రతిబింబించే సినిమా ఇది.'' అన్నారు.

    "ఒకప్పుడు ప్రేమంటే చూపులు కలిసిన ఎన్నాళ్ళకో మాటలు కలిసేవి. ఇప్పుడలా కాదు. ప్రపంచం వేగంగా ఉంది. అందుకే ఇటు చూశామా? అటు ఫోన్ నెంబర్ తీసుకున్నామా? ఓకే అంటే ఓకే. లేకుంటే ఇంకొకరు. ఒకరి కోసం ఇంకొకరు నెలలు, ఏళ్ళు వెయిట్ చేసే తీరిక ఉండటం లేదు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వెచ్చిస్తున్న సమయం విలువైన జీవితాన్ని వృథా చేస్తోందని చాలా మందికి అంతుబట్టడం లేదు. అలాంటి వారికి సందేశాలివ్వడం కూడా వృథానే. నిద్రలేచినప్పటి నుంచి ఇంట్లో తల్లిదండ్రులు నెత్తీనోరు కొట్టుకుని చెప్పినా వినని వారు రెండున్నర గంటల్లో నేను చెప్తే వింటారన్న భ్రమలు కూడా నాకు లేవు. కాకపోతే 'బస్‌స్టాప్' ద్వారా ఇప్పటి పరిస్థితుల గురించి ఓ చర్చను లేవనెత్తాను. కానీ ఎక్కడా హద్దులు దాటలేదు.'' అని మారుతి తేల్చి చెప్పారిు.

    English summary
    Congress Leader complaint to HRC against Bellamkonda Suresh’s movie Bus Stop.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X