రివ్యూల ఆపండి అంటూ 'నిర్మాతల మండలి' ప్రకటన
హైదరాబాద్: సినిమా రివ్యూలపై తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కోప్పడింది. మీడియా వాళ్లు ఇచ్చే రివ్యూల వల్ల సినిమా పరిశ్రమకు నష్టాలు వస్తున్నట్లు మండలి తెలిపింది. సినిమా విడుదల అవ్వగానే రివ్యూలు రాసే సంస్కృతిని మీడియా మానుకోవాలని కోరింది. చిత్ర పరిశ్రమ ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్ మీడియా సహకారం కోరుకుంటున్నట్లు తెలిపింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
మరోప్రక్క నిర్మాతల మండలి ప్రత్యేకంగా ఏ ఛానెళ్లతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపింది. ఏ నిర్మాత అయినా ఏ ఛానెల్ తో అయినా ఒప్పందం కుదుర్చుకుని సినిమా ప్రచారం చేసుకోవచ్చని పేర్కొంది.



Click it and Unblock the Notifications











