»   » మణిరత్నం 'ఒకే బంగారం' టైటిల్ వెనుక అసలు కథ

మణిరత్నం 'ఒకే బంగారం' టైటిల్ వెనుక అసలు కథ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌, నిత్య మేనన్‌ జంటగా నటించిన తమిళ చిత్రం 'ఓకే కన్మణి'.'ఓకే బంగారం' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దిల్‌రాజు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు 'ఒకే బంగారం' అనే టైటిల్ పెట్టడం వెనుక ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది. దిల్ రాజు మొదట ఈ చిత్రం రైట్స్ తీసుకోవటం కోసం మణిరత్నం ని కలిసినప్పుడు కన్మణి అంటే అర్దం ఏమిటి అని అడిగారు.

మణిరత్నం దానికి సమాధానంగా...కన్మణి అంటే డియర్..(ప్రియమైన) అని చెప్పారుట. వెంటనే దిల్ రాజు అయితే తెలుగులో 'ఓకే బంగారం' అనే టైటిల్ పెడతానని చెప్పటం జరిగిందట. మణిరత్నం కూడా ఈ టైటిల్ కు ఇంప్రెస్ అవటం, ఆ మరుసటి రోజు ఫిల్మ్ ఛాంబర్ లో టైటిల్ రిజిస్ట్రేషన్ జరిగిపోవటం క్షణాల్లో జరిగింది. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ నెలాఖరున పాటల్ని విడుదల చేస్తారు.

story behind Ok Bangaram title

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దిల్‌రాజు మాట్లాడుతూ ''ముంబయి నేపథ్యంలో ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య సాగే అందమైన ప్రేమకథే ఈ చిత్రం. విదేశాలకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న ఆ ఇద్దరూ కలిసి గడపాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు వారి మధ్య ఏర్పడిన ప్రేమ భావనలు ఎలాంటివి? ప్రేమకి ఎవరు ఓకే చెప్పారు? అనే విషయాలు ఆసక్తికరం. మమ్ముట్టి తనయుడు దుల్కర్‌, నిత్య మేనన్‌ చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. కీలకపాత్రలో ప్రకాష్‌రాజ్‌ నటించారు. తెలుగు, తమిళ భాషల్లో వచ్చే నెలలో సినిమా విడుదల చేస్తాము''అన్నారు.

ఈ చిత్రం ఆడియోని మార్చి 27న విడుదల చేయటానికి నిర్ణయించారు. ఇప్పటికే మెంటర్ మదిలో సాంగ్..అబిమానులను ఊపేస్తోంది.ఈ సినిమాలో హీరో దుల్కర్‌ సల్మాన్‌కు నాని డబ్బింగ్‌ చెబుతున్నారు.

story behind Ok Bangaram title

నాని మాట్లాడుతూ ‘‘మణిరత్నంగారికి నేను వీరాభిమానిని. ఆయన అడగడంతోపాటు దిల్‌ రాజుగారి మీదున్న గౌరవంతో హీరో పాత్రకు డబ్బింగ్‌ చెప్పేందుకు అంగీకరించాను. ఈ సినిమాకు డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు ‘సఖి' కంటే గొప్పగా ఉంటుందనిపించింది. కచ్చితంగా ‘సఖి''ని మించి హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు.

దిల్‌ రాజు మాట్లాడుతూ ‘‘గతంలో సఖి సినిమాను నైజాంలో విడుదల చేశాను. అది ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘ఓకే బంగారం' సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం రావడం గొప్పగా ఫీలవుతున్నాను. మణిరత్నంగారి దర్శకత్వం, పి.సి.శ్రీరామ్‌ ఫొటోగ్రఫీ, రెహమాన్‌ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. '' అని అన్నారు.

story behind Ok Bangaram title

ఇదొక ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టొరీ. సినిమాలో క్యారెక్టర్లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. మణిరత్నం ‘ఒకే బంగారం'తో తన స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూపిస్తాడు. అని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ సినిమా విజయంపై ధీమాను వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. తమిళంలో సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ పతాకంపై సుహాసిని మణిరత్నం, మణిరత్నంలు ‘ఒకే కన్మణి'ను నిర్మించారు.

మణిరత్నం చిత్రం అంటేనే ఆటోమేటిక్‌గా ఒక క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఆయన దర్శకత్వ శైలినే అందుకు కారణాలు కావచ్చు. మౌనరాగం, దళపతి, నాయకన్, అగ్నినక్షత్రం లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల సృష్టికర్త మణిరత్నం. ఈయన భారీ యాక్షన్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో ఎంత దిట్టనో, అందమైన ప్రేమ కథా చిత్రాలను సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించడంలోనూ అంత సిద్ధహస్తుడు.

మౌనరాగం, ఇదయత్తైతిరుడాదే (తెలుగులో గీతాంజలి), రోజా, అలప్పాయిదే వంటి ప్రేమ కథా చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయి. తాజాగా అలాంటి అద్భుత ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా నటి నిత్యామీనన్ నటిస్తున్నారు. ఈ చిత్ర కథ విని బల్క్ కాల్‌షీట్స్‌ను దుల్కర్ సల్మాన్ కేటాయించగా నటి నిత్యామీనన్ మణిరత్నం దర్శకత్వంలో నటించాలనే తన చిరకాల కోరిక ఈ చిత్రంతో నెరవేరడం ఆనందంగా ఉందన్నారు.

చిత్ర కథను దర్శకుడు చెప్పగానే స్ఫెల్‌బౌండ్ అయిపోయానని నిత్యామీనన్ అన్నారు. కాగా ఈ చిత్రంలో ముఖ్యభూమికను పోషిస్తున్న ప్రకాష్‌రాజ్ చాలాకాలం తరువాత ఒక మంచి చిత్రంలో నటిస్తున్నానంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మణిరత్నం ఆస్థాన విద్వాంసుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాలలో సెలైంట్‌గా జరుపుకుంది.


హీరోయిన్‌గా మొదట ఆలియా భట్ అనుకున్నారు. ఇప్పుడు తాజాగా నిత్యామీనన్ సీన్ లోకి వచ్చింది. నిత్య, దుల్ఖర్ ఇద్దరూ కలిసి నటించిన ‘ఉస్తాద్ హోటల్' మంచి హిట్ కొట్టింది. వీరిద్దరూ బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్‌గా వనితా ఫిల్మ్ అవార్డుకూడా అందుకున్నారు. ఇద్దరూ కలిసి నటించిన ‘హండ్రెడ్ డేస్ ఆఫ్ లవ్' త్వరలో విడుదల కాబోతోంది.

నిత్యా మీనన్ మాట్లాడుతూ... ‘‘మణిరత్నంలాంటి విజన్‌ ఉన్న దర్శకుడితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నేను నా కెరీర్‌ని ఎప్పుడూ ప్రత్యేకంగా ప్లాన్‌ చేయలేదు. అయినా చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతోంది'' అని అంటోంది నిత్యామీనన్‌. మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ సరసన నటిస్తోందీ భామ.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పి.సి శ్రీరామ్ పనిచేస్తున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ సఖి ఆఖరి చిత్రం.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహ్మాన్. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్‌, సహనిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌

English summary
Dil Raju asked Mani Ratnam what does 'Kanmani' mean and the filmmaker replied 'Dear'. Dil Raju then said 'Ok Bangaram' might be apt for the Telugu version.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu