»   » రెడీ టు రిలీజ్: 'తుంగభద్ర' స్టోరీ లైన్ ఏంటి?

రెడీ టు రిలీజ్: 'తుంగభద్ర' స్టోరీ లైన్ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :''తుంగ, భద్ర అనే రెండు నదులు కలిసి తుంగభద్ర అయింది. కానీ ఆ నదుల పక్కన ఉన్న ఓ వూళ్లోని మనుషులు మాత్రం కలవరు. అలాంటి రెండు వర్గాల మధ్య నలిగిన ఓ ప్రేమజంట కథే ఈ 'తుంగభద్ర' చిత్రం. ఇందులో రాజకీయాల ప్రస్తావనా ఉంటుంది. పార్టీలు ఎక్కడో ఉంటాయి. కానీ వాటి కోసం ఇక్కడ మనుషులు కొట్టుకుంటుంటారు. ఇందులో హీరో కొర్లపూడి శీను అనే కుర్రాడిగా కనిపిస్తారు. వూళ్లో రాజకీయ వాతావరణం అతన్ని ఎలా ప్రభావితం చేసిందన్నది ఆసక్తికరం. గుంటూరు నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో సహజత్వం అందరినీ అలరిస్తుంది''.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


స్టార్స్ కంటే కథను నమ్మి వరుసగా సినిమాలు చేస్తూ విజయాలు అందుకునట్టున్న నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం. ఈ బ్యానర్ అధినేత అయిన సాయి కొర్రపాటి కొత్త దర్శకులను, కొత్త నటీనటులను ఎంకరేజ్ చేస్తూ చేస్తున్న ప్రతి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయాలను అందుకుంటుంది. ఈ సంవత్సరలో ఇప్పటికే ‘లెజెండ్', ‘ఊహలు గుసగుసలాడే', ‘దిక్కులు చూడకు రామయ్యా' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సాయి కొర్రపాటి తన బ్యానర్ నుంచి వస్తున్న మరో సినిమా ‘తుంగభద్ర'


Story line of Tungabadra Movie

సాయి కొర్రపాటి శ్రీనివాస్ కృష్ణ గోగినేనిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాని మార్చి 20న గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. ఈ మూవీ ద్వారా అదిత్ హీరోగా పరిచయం అవుతుంటే ‘రొమాన్స్' ఫేం డింపుల్ చోపడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమిళ యాక్టర్ సత్యరాజ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి హరి గౌర మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆడియోతో పాటు ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.


చిత్రం గురించి హీరో ఆదిత్ మాట్లాడుతూ... ''నచ్చిన సినిమాలు నాకు రాలేదు. వచ్చిన సినిమాలు నాకు నచ్చలేదు. ఇప్పుడిప్పుడే నా పనితీరు నన్ను సంతృప్తి పరుస్తోంది. ఒక నటుడిగా నాలో పరిణతి పెరిగిందనిపిస్తోంది. అందుకే ఇదే నా తొలి చిత్రంగా భావిస్తున్నా'' అంటున్నారు ఆదిత్‌.


అలాగే... ''పాత్ర రీత్యా ఇందులో మాస్‌ లుక్‌తో కనిపించాల్సి వచ్చింది. అందుకు తగ్గట్టుగానే శరీరాకృతి మార్చుకున్నా. గడ్డం పెంచి నటించా. ఈ లుక్‌ ఇక్కడ నాకు కొత్తగానే అనిపిస్తుంది కానీ... తమిళంలో 'తేనీరు విడిది' అనే చిత్రంలో ఇలాగే కనిపించా. ఇలాంటి పాత్రలను అర్థం చేసుకొని నటించడంలోనే ఉంటుంది అసలు పనితనం. ఇందులో నా నటన నాకు పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చింది. తదుపరి 'నీవైపే' అనే ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్నా'' అని చెప్పుకొచ్చారు.

English summary
Tungabhadra’, a village-based love story directed by newcomer Srinivasa Krishna Gogineni is gearing up for a release on March 20.
Please Wait while comments are loading...