twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూర్య 'సెవెంత్ సెన్స్' కధేమిటి?

    By Srikanya
    |

    ఇప్పుడు ఎక్కడ విన్నా మురగదాస్, సూర్య కాంబినేషన్ లో రెడీ అయ్యి ఈ నెల 26 న విడుదల కానున్న సెవెంత్ సెన్స్ చిత్రం గురించి చర్చలే. ఈ చిత్రంలో కథ ప్రకారం..బోధి ధర్మ... వందల ఏళ్ల నాటి బౌద్ధ బిక్షువు. మార్షల్ ఆర్ట్స్ అనే గొప్ప విద్యకు ప్రపంచఖ్యాతిని తీసుకొచ్చిన మహనీయుల్లో ఒకడు. కాలగర్భంలో కలిసి పోయిన ఆ బౌద్ధ బిక్షువు డీఎన్‌ఏ కొందరు శాస్త్రవేత్తలకు లభించింది. ఆ తర్వాత జరిగిన అద్భుతమే ప్రధానాంశంగా తమిళంలో రూపొందిన చిత్రం 7ఏఎమ్ అరివు గా రూపొందింది. లక్ష్మీగణపతి ఫిలింస్‌వారు ఈ చిత్రాన్ని సెవన్త్ సెన్స్ గా తెలుగులోకి అనువదించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 26న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో సూర్య రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు.శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా గురించి లక్ష్మీగణపతి ఫిలింస్ అధినేత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మా సంస్థ ఖ్యాతిని రెట్టింపు చేసే సినిమా ఇది.

    మురుగదాస్ మరో అద్భుత సృష్టి ఈ సినిమా. కొత్త సెన్స్‌ని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారాయన. హేరిస్ జైరాజ్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రీరికార్డింగ్ వండర్‌గా ఉంటుంది. సిక్స్త్ సెన్స్ అనేది ఊహించే నిజం. సెవన్త్ సెన్స్ అనేది ఊహించలేని నిజం. అది మీరు తెరపై చూస్తారు. ఇందులో ఓ హాలీవుడ్ నటుడు విలన్‌గా నటించడం విశేషం. రోబో కంటే ఎక్కువ ధియేటర్లలో సినిమాను విడుదల చేయమని డిస్ట్రిబ్యూటర్స్ అడుగుతున్నారు. త్వరలో థియేటర్ల లిస్ట్ ప్రకటిస్తాం. దీపావళి కానుకగా ఈ నెల 26న విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఓ కొత్త లోకంలో విహరింపజేయడం ఖాయం అంటున్నారు.

    English summary
    Subrahmaniam B and Rupesh are producing ‘Seventh Sense’ movie in Telugu which is slated for Deepavali release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X